ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే వేలంపాటలు నిర్వహిస్తున్నాము.మున్సిపల్ కమిషనర్ పీ. శ్రీ హరిబాబు.
పురపాలక సంఘం కార్యాలయమునకు సంభదించిన ప్రత్తిపాటి పుల్లారావు మున్సిపల్ కాంప్లెక్స్, గాంధీ పార్క్ దక్షిణం వైపు గల మున్సిపల్ కాంప్లెక్స్ లు లోని షాపుల లీజు కాలముగిసినందున మంగళవారం పురపాలక సంఘ కార్యాలయములో మునిసిపల్ కమిషనర్ పీ. శ్రీహరిబాబు ఆధ్వర్యంలో ప్రారంభమైన షాపు రూముల వేలం పాటలు ,షాపు రూములు దక్కించుకునేందుకు భారీగా లబ్ధి దారులు హాజరయ్యారు.మున్సిపల్ కమిషనర్ పి.శ్రీహరి బాబు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ షాపులు 25 సంవత్సరాలు పూర్తి అయిన ప్రత్తిపాటి కాంప్లెక్స్ నందు 20 షాపులు, గాంధీ పార్కునందు షాపులు 16 ఉన్నాయి.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వేలం పాటలు చేపట్టాము.షాపుల ధరతగ్గించే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తాము, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చేంతవరకు పాత పద్ధతిలోని షాపుల వేలంపాట నిర్వహిస్తామని తెలియజేశారు.ప్రత్తిపాటి మున్సిపల్ షాపులను 20 మంది లబ్ధిదారులకు పాల్గొన్నారు. వేలం పాట ద్వారా వారికి అందజేశామన్నారు.ప్రభుత్వం మూడు సంవత్సరాలు 33శాతం పెంచే విషయంలో పునారా ఆలోచన చేస్తుందన్నారు. గాంధీ పార్కు మునిసిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ధరలు ఎక్కువగా ఉన్నాయని లబ్ధిదారులు రాలేదని, మళ్ళీ వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు. సండ్రి మార్కెట్ వేలంపాట మూడు దఫాలుగా నిర్వహించాము, వేలంపాట పాడేందుకు ఎవరు ముందుకు రాలేదన్నారు.



