Author: chilakaluripetalocalnews@gmail.com

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం : రూరల్ ఎస్సై అనిల్ చిలకలూరిపేట రూరల్ ఎస్సై అనిల్ కుమార్ పసుమర్రు గ్రామంలో పర్యటించి గ్రామస్తులకు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అనిల్ హెచ్చరించారు. పల్లె నిద్ర, అవగాహన కార్యక్రమం పోలీసుల బృందం పసుమర్రు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులతో మమేకమయ్యారు. నేటి సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. చర్చించిన ముఖ్య అంశాలు ఎస్సై అనిల్ గ్రామస్తులతో రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్, ఆస్తి గొడవలు, ఆత్మహత్యలు, గంజాయి స్మగ్లింగ్ వంటి వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలపై ప్రజలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి, తీసుకోవాల్సిన జాగ్రత్తలనువివరించారు. పోలీసులకు సమాచారం…

Read More

ఈ నెల 10 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాలు పర్చూరు, ,చిలకలూరిపేట, మార్టూరు, మద్దిపాడు,ఇంకొల్లులలో కేంద్రాలు కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై మార్కెఫెడ్ డీఎం సమీక్ష పొగాకు కొంటామని ముందుకొచ్చిన ప్రభుత్వం మొత్తం పొగాకు కొంటామన్న కలెక్టర్ వెంకట మురళి మార్కెఫెడ్ ఆధ్వర్యంలో బ్లాక్ బర్లీ కొనుగోలు త్వరలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు సన్నాహాలు ఆరు కొనుగోలు కేంద్రాల నుంచి పొగాకు రైతులు వద్ద నుంచి కొనే అవకాశం క్వింటాకు 12000 తగ్గకుండా పొగాకు కొంటామన్నా అధికారులు ఫలించిన పొగాకు రైతులుదీక్ష,పోరాటాలు

Read More

కిశోరిబాలికలకు క్రీడలపై అవగాహన ర్యాలీ యడ్లపాడు ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కిశోరి వికాసం వేసవి శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఈ అవగాహన ర్యాలీని ఎంపీపీ ఝాన్సీ సాగర్, ఎంపీడీవో వి. హేమలతాదేవి బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీలో వారు మాట్లాడుతూ, పిల్లలను టీవీలు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచి శారీరక శ్రమ కలిగించే క్రీడల్లో పాల్గొనేటట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. క్రీడల ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి, ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, కిశోర బాలికలు పాల్గొన్నారు.

Read More

త్యాగం, క్షమకు కట్టుబడి ప్రతి ఒక్కరూ తమలోని స్వార్థాన్ని త్యజించాలన్నదే బక్రీద్ ప్రధానోద్దేశం : మాజీమంత్రి ప్రత్తిపాటి

Read More

పేట అభివృద్ధికి ప్రత్తిపాటి పుల్లారావు కృషి: మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని చిలకలూరిపేట పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, తన చాంబర్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిందని, ఈ కాలంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం సాగర్ నుండి చిలకలూరిపేట మంచినీటి చెరువుకి నేరుగా పైప్‌లైన్ వేయించడం చాలా గొప్ప విషయమని, ఈ విషయంలో ప్రత్తిపాటి పుల్లారావుకు మున్సిపల్ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సర కాలంగా, కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి పురపాలక సంఘంలో పారిశుద్ధ్యం మరియు తాగునీటి విషయంలో చాలా కట్టుదిట్టంగా వ్యవహరించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించే వారిని తొలగించాలని మున్సిపల్…

Read More

ప్రభుత్వ చీఫ్ విప్ గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ వినుకొండ పట్టణంలో ప్రభుత్వ చీఫ్ విప్ గారి కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీజీవీ ఆంజనేయులు గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు ప్రజల నుండి వినతులు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చీఫ్ విప్‌ గారి కి తెలియజేయడంతో, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్‌కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమం లో నాయకులు పాల్గొన్నారు.

Read More

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని గారిని కలిసిన శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ గారు సత్తెనపల్లి శాసన సభ్యులుశ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని. విజయవాడ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి గురించి.మరియు ఆరోగ్య శాఖకు .సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు

Read More

కొనసాగుతున్న విద్యుత్ మరమ్మత్తు పనులు పట్టణంలో ని 6వ వార్డులో ఎన్టీఆర్ కాలనీ మరియు లక్ష్మీ నరసింహ కాలనీ లో విద్యుత్ మరమ్మతులు చేపట్టిన సిబ్బంది. విద్యుత్ మరమ్మతులు నేపథ్యంలో కరెంట్ సరఫరా నిలిపి ఈ మరమ్మతులు చేశారు. లైట్లు పోయిన ప్రాంతాల్లో పాత లైట్లు,తొలగించి, ఆ స్థానంలో కొత్త లైట్లు వేశారు. శాసన సభ్యులు ప్రత్తిపాటి ఆదేశాలు తో ఈ మరమ్మతులు చేసినట్లు సిబ్బంది తెలిపారు .

Read More

యడ్లపాడు గ్రామ వాస్తవ్యులు జరుగుల వీరభద్ర రావు గారు నిన్న తుది శ్వాస విడిచారు. వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి… అలాగే యడ్లపాడు గ్రామపంచాయతీ మాజీ వైస్ ప్రెసిడెంట్ ముత్తవరపు సుబ్బారావు గారి తల్లి జానకమ్మ గారు స్వర్గస్తులైనారు. వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ గారు… ఈ కార్యక్రమములలో వారి వెంట కల్లూరి బుల్లియ్య గారు, కల్లూరి శ్రీనివాసరావు గారు, రాచమంటి చింతారావు గారు, మద్దాల హరిప్రసాద్ గారు, బండ్ల సాంబయ్య గారు, బండ్ల పున్నారావు గారు, మండెపూడి శ్రీనివాసరావు గారు, రావూరి నాగేశ్వరరావు గారు తదితరులున్నారు

Read More

మొక్కలు నాటిన ఎమ్మెల్యే డా”చదలవాడ అరవింద బాబు పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరితాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డా”చదలవాడ అరవింద బాబు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ శంకరభారతి పురం ప్రభుత్వ పాఠశాల ఎస్ ఎస్&ఎన్ కళాశాలలో మొక్కలను నాటారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతిని రక్షించుకునే బాధ్యత తీసుకుందామని ప్రతి ఒక్కరం మొక్కలు నాటి హరితాంధ్రప్రదేశ్ నిర్మించుకుందామని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమలకు శ్రీకారం చేపట్టడం మంచి ఆలోచన అని స్వచ్ఛ ఆంధ్ర హరిత ఆంధ్ర యోగ ఆంధ్ర వంటి కార్యక్రమాలు విజయవంతగా జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు రాష్ట్ర గ్రంధాలయాలు చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నరు

Read More