పోగొట్టుకున్న బ్యాగ్ మరియు ఫోన్ రికవరీ…

గంటల వ్యవధిలో రికవరీ చేసి బాధితులకు అందజేసిన ఎస్ఐ. శివరామకృష్ణ.

ఎడ్లపాడు మండల పరిధిలోని
కొండవీడు చిల్డ్రన్ పార్క్ సందర్శనకు పర్చూరు (బాపట్ల జిల్లా) కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు 13.07.2025 రాత్రి 7 గంటల సమయంలో,కొండవీడు చిల్డ్రన్ పార్క్ సందర్శనకు వెళ్లి, అక్కడ తన బ్యాగ్ మరియు సెల్ ఫోన్ పోయాయని రాత్రి 9 గంటలకు ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐ శివరామకృష్ణ మరియు సిబ్బంది హెడ్‌ క్వార్టర్స్‌ను సంప్రదించి, మొబైల్ లొకేషన్ సాయంతో ఒక గంట వ్యవధి లో బ్యాగ్ మరియు ఫోన్‌ ను కొండవీడు సమీపంలోనీ అరటి తోటలో గుర్తించి తిరిగి శ్రీనివాసరావు కి అప్పగించడం జరిగింది.ఈరోజు మరొక ఫిర్యాదు మధ్యాహ్నం 12 గంటలకు తిమ్మాపురం గ్రామానికి చెందిన హార్టికల్చర్ అసిస్టెంట్ శైఖ్ ఐషా తమ మొబైల్ పోయినట్లు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఎస్ఐ హెడ్‌క్వార్టర్స్ సహాయంతో ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసి 12:30 గంటలకు మొబైల్‌ను గుర్తించి వారికి అప్పగించడం జరిగింది.ఈ రెండు ఘటనల్లో కూడా పోలీసుల వేగవంతమైన చర్యలతో ప్రజల ఆస్తి సురక్షితంగా తిరిగి అందించబడింది.ఈ సందర్భంగా బాధితులు పోలీసుల సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా ఎడ్లపాడు ఎస్సై శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు తమ విలువైన వస్తువులపై జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి నష్టం జరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరుతున్నాము అని తెలిపారు.

Share.
Leave A Reply