మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబుకు అభినందనలు తెలియజేసిన: చైర్మన్ రఫాని
చిలకలూరిపేట : ప్లాస్టిక్ నిషేధం పై కఠిన చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్
పి. శ్రీహరి బాబుకు, మునిసిపల్ చైర్మెన్ షేక్ రఫానీ అభినందనలు తెలియజేసి సచివాలయ సిబ్బంది మెప్మా రిసోర్స్ పర్సనల్ చేత చప్పట్లతో హర్షవర్ధన్ చేయించారు. స్థానిక పురపాలక సంఘంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మందిరంలో మెప్మా సిబ్బంది సచివాలయా సెక్రటరీలతో మునిసిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని నేడు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం చర్యలో భాగంగా నేడు వ్యాపారస్తుల దుకాణాలపై తనిఖీలు పంపించిన కమిషనర్ కు సిబ్బందికి మున్సిపల్ చైర్మన్ అభినందించడమే కాకుండా చప్పట్లతో హర్షం ప్రకటించిన ఘటన చోటుచేసుకుంది.. పట్టణ ప్రజల ప్రజారోగ్యంపై చిత్తశుద్ధితో వివరించే ఇటువంటి అధికారులను అభినందించడం అందరి బాధ్యతఅని కొనియాడారు..



