చిలకలూరిపేట తెలగ,కాపు,బలిజ కళ్యాణ మండపంను యనమదల (గ్రామం),యద్దనపూడి (మండలం),బాపట్ల(జిల్లా) గ్రామ వాస్తవ్యులు మన కాపు సామాజికవర్గానికి చెందిన ప్రముఖ వాస్తు సిద్ధాంతి శ్రీ.ఏలిసెట్టి రాము గారు సందర్శించి కళ్యాణ మండపం ప్రస్తుత వాస్తు పరిశీలించి వారు తమ అమూల్యమైన సలహాలు,సూచనలు తెలియజేశారు.తదుపరి కళ్యాణ మండపంలోని వాస్తులో ఉన్న లోపాలు సరిచెసి మనకు ప్లాన్ ఇస్తాను అని సహృదయంతో తెలియజేశారు.కళ్యాణ మండపమునకు సంబంధించిన వాస్తు శాస్త్రంను ఉచితంగా అందజేస్తాను అని కులం పట్ల ఉన్న అభిమానం తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చిలకలూరిపేటకు చెందిన కాపు సోదరులు పోతురాజు హరిష్,ఉసా రమేష్,ఉయ్యూరు నరసింహారావు,ఇర్రి రాఘవ,కమ్మిళి శివా రామకృష్ణ,మండలనేని జగదీష్,మిరియాలు లక్ష్మీ నారాయణ,మారెళ్ళ శ్రీను, రామిశెట్టి శివ ప్రసాద్,బందరు కృష్ణ ప్రసాద్ మరియు రామిశెట్టీ చంద్ర గార్లు పాల్గొన్నారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
పేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాముసాని వెంకట శృతి (9) స.అనే బాలిక మృతి ప్రమాద వివరాలు చిలకలూరిపేటలోని వైఎస్సార్ కాలనీకి చెందిన గాలేటి రాంబాబు (20), తన ద్విచక్రవాహనం (AP 07 CW 5311)పై తన భార్య కావేరి, మేనకోడళ్లు పాముసాని బాల సాహితీ, పామసాని వెంకట శృతిలను ఎక్కించుకొని కనపర్రు చర్చికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లింగంగుంట్ల వంతెన దాటిన తర్వాత వెనుక నుండి వచ్చిన ఒక బస్సు (AP 07 Z 0207) ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బండి ట్యాంక్పై కూర్చున్న వెంకట శృతి బస్సు కింద పడటంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.రాంబాబుకు, అతని భార్య కావేరికి స్వల్ప గాయాలయ్యాయి. బాల సాహితీకి ఎటువంటి గాయాలు కాలేదు. చికిత్స మరియు మరణం గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ నుండి మెరుగైన చికిత్స కోసం వెంకట శృతిని గుంటూరు జీజీహెచ్‌కు…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి గారు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశికుమార్ గారి పిలుపు మేరకు, పెదకూరపాడు నియోజకవర్గం, అచ్చంపేట మండలంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణాచారి గారి ఆధ్వర్యంలో మండల స్థాయి వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించటం జరిగింది.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు, అమరావతి ఎంపీపీ, బిజెపి నాయకులు మేకల హనుమంతరావు గారు పాల్గొన్నారు, బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గడచిన 11 సంవత్సరాల లో సాధించిన విజయాలను ప్రజలకు తెలియ చెప్పాలని సూచించారు, కేంద్ర పధకాలు మారుమూల గ్రామాల్లో ఉన్న అట్టడుగు వ్యక్తికి కూడా అందేలా చూడటమే నరేంద్ర మోడీ గారి లక్ష్యమని తెలిపారు.. కార్యక్రమంలో అమరావతి మండల బిజెపి అధ్యక్షులు వాడపర్తి పుల్లారావు గారు, పలువురు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…
పల్నాడు జిల్లా SP ఆదేశాలతో సైబర్ క్రైం పై కార్మికులు కు అవగాహన నేరాలకు పాల్పడితే జైలుకే స్పిన్నింగ్ మిల్లు లో అవగాహన కల్పించిన రూరల్ CI సుబ్బా నాయుడు తిమ్మాపురం తిరుమల స్పిన్నింగ్ మిల్లు లో కార్మికులు కు నేరాల పట్ల అవగాహన కల్పించిన CI సుబ్బా నాయుడు మాదక ద్రవ్యాల వినియోగం, మద్యపానం చేసి మహిళలు పై దాడులు చేయడం, అత్యాచారం చేయడం వంటి నేరాల పట్ల అవగాహన కల్పించారు నేరాలకు అలవాటు పడవద్దని, కార్మికుల కు సుస్థిర మైన భవిష్యత్ ఉందని సూచించారు నేరాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
కాపుల్ని బీసీల చేర్చాలని డిమాండ్ నెరవేర్చడం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు కాపు ముద్దుబిడ్డ సానా ప్రసాద్ చిత్తూరు నుండి అమరావతి వరకు జరుగుతున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరరావు సానా ప్రసాద్ కాపు బిడ్డ, ఒంగోలు వాస్తవ్యుడు ఆంధ్రప్రదేశ్ కాపు, బలిజ, తెలగ, ఒంటరి BC రిజర్వేషన్స్ సాధన సమితి వ్యవస్థపక అధ్యక్షుడు 08.06.’25 న చిత్తూరు నుండి అమరావతి వరకు కాపు పెద్దల సౌజన్యముతో, ఎలాంటి రాజకీయ పార్టీలకు గ్రూపులకు అతీతముగా ప్రారంభించిన శాంతియుత పాదయాత్ర తిరుపతికి కాళహస్తి రాజంపేట మీదుగా కడప కర్నూల్ తరువాత ప్రకాశం జిల్లా లో హైవే లోకి వస్తారు తిరుపతిలో రాయలసీమ కాపు పెద్దలతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకొని తదుపరి రాజంపేట కు చేరుచున్న పాదయాత్ర. చిత్తూరు నుండి రేణిగుంట వరకు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల పెద్దలు,…
రెంటపాళ్ళ గ్రామాన్ని సందర్శించిన వైసీపీ నాయకులు పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని రెంటపాళ్ళ గ్రామంలో ఈనెల 18 వ తారీకు ఉప సర్పంచ్ శివనాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రానున్న, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి. రెంటపాళ్లలో విగ్రహావిష్కరణ పర్యటన లో భాగంగా, గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి ఎమ్మెల్సీ తలసరి రఘురాం , ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు విడుదల రజిని, పేర్ని నాని, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
షేక్ మహబూబ్ సుభాని గారి కుమారుల (ఖుద్దూస్ గారి మనుమళ్ళ) అఖికా వేడుక చిలకలూరిపేట పట్టణంలోని జంపాని సినీ కళ్యాణమండపం నందు జరుగుచుండగా ఆ కార్యక్రమానికి హాజరై చిరంజీవులు మహమ్మద్ అష్రాఫ్, మహమ్మద్ అసాద్ లను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ వేడుకలో వారి వెంట స్పెట్స్ కరిముల్లా గారు, AVM సుభాని గారు, భక్షు మేస్త్రి గారు, అత్తలూరి షరీఫ్ గారు తదితరులు ఉన్నారు.
దేశం ఆశ్చర్యపోయేలా, మోదీ గర్వించేలా ‘యోగాంధ్ర’ చరిత్రలో నిలవాలి : ప్రత్తిపాటి దేశం గర్వించేలా, రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడించేలా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ల పేరు ప్రఖ్యాతులు పెంచేలా జూన్ 21న సాగరతీరాన జరిగే యోగాంధ్ర కార్యక్రమం చరిత్రలో నిలిచిపోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. యోగాంధ్ర నిర్వహణ విజయవంతంపై ఆదివారం ఆయన విశాఖపట్నంలోని గురజాడ కళాపరిషత్, స్థానిక వీ.ఆర్.డీ.ఎం.ఏ కార్యాలయంలో కూటమిపార్టీల శ్రేణులు, డ్వాక్రా, మెప్మా సంఘాల మహిళలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. యోగాంధ్ర బహిరంగ సభా నిర్వహణలో భాగంగా విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహాకారం కావాలని ఈ సందర్భంగా ప్రత్తిపాటి కోరారు. సూపర్-6 అమలుతో జగన్ అడ్రస్ గల్లంతే…తల్లికి వందనం అమలుతో చంద్రబాబు చరిత్ర సృష్టించారని, సూపర్ -6 అమలైతే జగన్ అడ్రస్సే గల్లంతవుతుందని, ప్రభుత్వ పథకాల ఫలాలు అందాక ప్రజలు…
కూటమి ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై చర్యలు చేపట్టాలి . విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. అనుమతులు లేని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలను రద్దు చేయాలి-బి.శ్రీను నాయక్. కూటమి ప్రభుత్వం ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఎన్నారై సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు విద్యను వ్యాపారంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాల చెందిన విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఎంతో కొంత విద్యార్థుల ఫీజులపై నియంత్రణ ఉండేదని కనీసం ఆ విధంగా లేకపోవడం చాలా దారుణం అన్నారు. విద్యార్థుల ఫీజుల భారంగా మారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కోరుకోవలసిన పరిస్థితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణపై ప్రతిష్టమైన చర్యలు…
ఈనెల 18వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వర్యులు,వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన నేపథ్యంలో ఈరోజు సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాళ్ల గ్రామంలో పార్టీ నేతలతో పాటు పర్యటించి రూట్ మ్యాప్ పరిశీలించిన మాజీ మంత్రి వర్యులు విడదల రజిని .