పదవీ గండమే టీమ్ 11 ను అసెంబ్లీ గడప తొక్కిస్తోంది : ప్రత్తిపాటి
- తన పాలనలో పురుడుపోసుకున్న మహాపాపాలు, కుంభకోణాలు జగన్ స్పందన కోసం ఎదురుచూస్తున్నాయి : ప్రత్తిపాటి.
- గతంలో తమకు జీతాలతో పనిలేదన్న జగన్..ఇప్పుడు ఎందుకు అసెంబ్లీకి వస్తున్నాడో చెప్పాలి : ప్రత్తిపాటి.
- వైసీపీ నేతలు ఆందోళన చెందాల్సింది జగన్ భద్రతపైకాదు.. ప్రజల భద్రతపై : ప్రత్తిపాటి.
“ పదవీ గండమే టీమ్ 11ను అసెంబ్లీ గడప తొక్కేలా చేస్తోంది. తమను గెలిపించిన ప్రజల్ని పట్టించుకోని ప్రజాప్రతినిధుల్ని ఉపేక్షించకూడదన్న స్పీకర్ నిర్ణయమే.. జగన్ & టీమ్ ను ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చేలా చేసిందనే చెప్పాలి. ఉన్న ఎమ్మెల్యే పోస్టు కూడా ఊడితే.. ప్రజల్లో మరీ చులకన అవుతామన్న భయంకూడా మరో కారణం. ప్యాలెస్ లు, విలాసాలపై ఉన్న మోజులో పదోవంతు కూడా జగన్ కు ప్రజాసమస్యలపై లేకపోవడం విచారకరం. ఎన్నికలప్పుడు తప్ప మరెప్పుడూ తనకు ప్రజలతో పనిలేదని తన చర్యలతో జగన్ పదేపదే నిరూపిస్తున్నాడు. గతంలో తమకు జీతాలతో పనిలేదు…స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా వుయ్ డోంట్ కేర్ జగన్.. ఇప్పుడు ఏ ఉద్దేశంతో, ఎవరిని ఉద్దరించడానికి అసెంబ్లీకి వస్తున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి.
వైసీపీ నేతలు ఆందోళన చెందాల్సింది జగన్ భద్రతపైకాదు..ప్రజల భద్రతపై
తనను దారుణంగా ఓడించారన్న విద్వేషంతోనే, జగన్ పరామర్శల పేరుతో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. జగన్ వైఖరిపై సొంత పార్టీనేతలే పెదవి విరుస్తున్నారు. ఒక్కరిని పరామర్శించడానికి గంటల తరబడి ప్రయాణం.. కావాలనే రోడ్లపై విన్యాసాలు చేయడం.. బతిమాలి.. ప్రలోభపెట్టి తీసుకొచ్చిన కార్యకర్తల ప్రాణాల మీదకు తీసుకురావడం వంటి చర్యలతో ఏం చేయాలో పాలుపోక వైసీపీనేతలు తలలు పట్టుకుంటున్నారు. వైసీపీ నేతలు ఆందోళన చెందాల్సింది జగన్ భద్రతపై కాదు.. ప్రజల భద్రతపై. జగన్ బయటకు వస్తే తమకే ముప్పు ముంచకొస్తుందో..ఏ అమాయకుడు ప్రాణం ఎప్పుడు పోతోందనన్న భయాందోళనలో ప్రజలున్నారనే నిజాన్ని వైసీపీనాయకులు గ్రహించాలి.
మహా పాపాలు… కుంభకోణాలు జగన్ అసెంబ్లీ స్పందన కోసం ఎదురుచూస్తున్నాయి
తన ఐదేళ్ల పాలనలో పురుడుపోసుకున్న మహాపాపాలు, భారీ కుంభకోణాలు జగన్ స్పందన కోసం ఎదురుచూస్తున్నాయి. తమతో తనకున్న అనుబంధాన్ని స్వయంగా జగనే అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాలని గగ్గోలు పెడుతున్నాయి. కల్తీనెయ్యి మహాపాపంలో తనకు తానేక్లీన్ చిట్ ఇచ్చుకున్నజగన్ కు వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. కల్తీనెయ్యి పాపంలో తన ప్రమేయం లేదని తనకేం తెలియదని బయట బుకాయిస్తున్న జగన్..సభలో ఆ అంశంపై మాట్లాడాలని రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కల్తీనెయ్యి, పరకామణి చోరీ సహా తిరుమల కేంద్రంగా తన హాయాంలో జరిగిన మహా పాపాలపై చట్టసభలో జగన్ నోరు విప్పాలి. అని మాజీమంత్రి ఒక ప్రకటనలో ప్రత్తిపాటి డిమాండ్ చేశారు.



