Author: chilakaluripetalocalnews@gmail.com

చిలకలూరిపేటలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలు ఘనంగా నిర్వహణ చిలకలూరిపేట : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిలకలూరిపేటలోని మాజీ మంత్రివర్యులు, శాసన సభ్యులు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో గల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, రైతు సంక్షేమం, మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి…

Read More

పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 1 గంటలకు ముగింపు చేయడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పాల్గొని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది వచ్చిన పిర్యాదులు అచంపేట్ మండలం నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి ఫిర్యాదులు రావడం జరిగింది పాల్గొన్న నాయకులు: ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారధి…

Read More

టీడ్కో గృహాల ఓటర్ల మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి: నవతరం పార్టీ చిలకలూరిపేట: పట్టణ పరిధిలోని ఏపీ టీడ్కో గృహాలలో నివసిస్తున్న వేలాది మంది ఓటర్ల వివరాల మ్యాపింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఎన్నికల అధికారులను కోరారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో నిర్వహించిన ఓరియంటేషన్ వర్క్‌షాప్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. పట్టణంలోని టీడ్కో గృహాలలో నివసిస్తున్న సుమారు పదివేల మంది ఓటర్ల వివరాలు ఓటర్ల జాబితాలో సక్రమంగా నమోదుకాకపోతే ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీడ్కో గృహాల ఓటర్లను ఏ విధంగా మ్యాపింగ్ చేస్తారో స్పష్టమైన వివరణ ఇవ్వడంతో పాటు, అవసరమైతే వారికి ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామని మండల తహసీల్దార్…

Read More

అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య.. భార్యాభర్తల అరెస్ట్ 📍 చిలకలూరిపేట అక్రమ సంబంధం కారణంగా ఓ వ్యక్తిని అత్యంత క్రూరంగా హత్య చేసిన కేసును చిలకలూరిపేట రూరల్ పోలీసులు ఛేదించి నిందితులైన భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. గురువారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ వి. హనుమంతరావు కేసు వివరాలను వెల్లడించారు. ఘటన వివరాలు చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ (45) టింకరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి పట్టణానికి చెందిన షేక్ కాలేషా భార్య మనీషాతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం కారణంగా కాలేషా, మనీషా దంపతుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సంబంధం కారణంగా తమ కుటుంబ జీవితం దెబ్బతింటోందని భావించిన కాలేషా, జాకీర్‌ను హత్య చేయాలని పథకం రచించాడు. ఈ పథకానికి మనీషా కూడా సహకరించింది. హత్య ఎలా జరిగింది? జూన్…

Read More

నియోజకవర్గంలో టీడీపీ విజయం శాశ్వతం కావాలి : ప్రత్తిపాటి పుల్లారావు 📍 చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ విజయానికి కార్యకర్తల కృషే మూలమని, నియోజకవర్గంలో టీడీపీ జెండా తప్ప మరో జెండా ఎగరని స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సోషల్ మీడియాలో చురుకుగా ఉండి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించిన బీఎల్ఓల అవగాహన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన భాష్యం రామకృష్ణను టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. రాజధాని అభివృద్ధిలో కేంద్రం కీలకం అమరావతికి చట్టబద్ధత కల్పించడం, నిర్మాణానికి నిధులు అందించడం, కేంద్ర సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రాజధాని అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని ప్రత్తిపాటి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌కు ప్రపంచవ్యాప్తంగా…

Read More

చిలకలూరిపేట లోకల్ న్యూస్ మోదీ రికార్డు ఎప్పటికీ చెక్కు చెదరదు : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట: దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 4,399 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ, మోదీ సుదీర్ఘకాలం దేశ ప్రధానిగా చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరవలేరని పేర్కొన్నారు. ప్రధాని హోదాలో మోదీ మొదటిసారిగా 2014లో చిలకలూరిపేటకు వచ్చిన సమయంలోనే ఆయన సుదీర్ఘకాలం ప్రధానిగా కొనసాగుతారని తాను చెప్పానని, ఆ మాట నేడు నిజమైందని ప్రత్తిపాటి తెలిపారు. దేశంలో అత్యంత అనుభవజ్ఞులైన నాయకులు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి అని పేర్కొన్న ఆయన, వారి నాయకత్వంలో దేశం మరియు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పోటీపడటం గర్వించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ మరియు కూటమి నాయకులు పెద్ద…

Read More

చిలకలూరిపేటలో టైర్ పేలి అదుపుతప్పిన కారు.. ఐదుగురికి స్వల్ప గాయాలు చిలకలూరిపేట, జూన్ 10: హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్‌కు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారు (AP 09 BV 1251) పసుమర్రు గ్రామం సమీపంలోని మలుపు వద్ద టైర్ పేలడంతో అదుపుతప్పి రోడ్డుపక్కకు పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి స్వల్ప గాయాలు కాగా, సమాచారం అందుకున్న చిలకలూరిపేట రూరల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. – చిలకలూరిపేట లోకల్ న్యూస్

Read More

జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి జిల్లాలో నిర్దేశిత గడువులోగా సర్ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలను పూర్తి చేయాలని‌జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు.స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ అంశాలపై మంగళవారం క్యాంపు కార్యాలయం లో జాయింట్ కలెక్టర్ సంజన సింహ,ఎలక్షన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో , స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోని బీఎల్వోలు తప్పనిసరిగా ప్రతి ఇంటిని సందర్శించి, ఓటర్ల వివరాలను సేకరించి వాటిని 2002 ఓటరు జాబితాతో క్షుణ్ణంగా మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ అంశంపై బిఎల్వోలు పోలింగ్ కేంద్రాల పరిధిలోని వివిధ పార్టీల బూత్ ఏజెంట్ (బిఎల్ఏ)…

Read More

చిలకలూరిపేట గడియార స్తంభం సెంటర్ వద్ద ముమ్మరంగా వాహన తనిఖీలుఎస్ఐ హజరత్ అయ్య ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చిలకలూరిపేట పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎస్ఐ హజరత్ అయ్య ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో ప్రధానంగా హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి జరిమానాలు విధించారు. అలాగే ఒకే బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్న త్రిబుల్ రైడింగ్ వాహనదారులను ఆపి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ హజరత్ అయ్య మాట్లాడుతూ, “ప్రజల ప్రాణ రక్షణే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. త్రిబుల్ రైడింగ్ చేయడం చట్ట విరుద్ధమే కాకుండా ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన…

Read More

జనతా వారధిది. 08.06.2026 సోమవారం విషయం : గీత కులాల గౌరవం – పర్యావరణ పరిరక్షణ – స్వావలంబన కోసం వినతి తరతరాలుగా ప్రకృతితో మమేకమై జీవిస్తూ, తాటి చెట్టును ఆధారంగా చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్న గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, ఈడిగ, యాత తదితర గీత కులాల ఆకాంక్షలను మీ ముందుకు వినమ్రంగా తీసుకువస్తున్నాము. భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న “జనతా వారధి” కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గీత కులాల స్థితిగతులను అధ్యయనం చేయడం జరిగింది. అలాగే గీత కులాల సంఘాలు, సొసైటీలు, పెద్దలు, మేధావులు మరియు వృత్తిదారులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వచ్చిన సూచనలు, అభిప్రాయాలు మరియు ఆకాంక్షల ఆధారంగా ఈ వినతిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తున్నాము. భారతదేశ సనాతన జీవన విధానంలో తాటి చెట్టు ఒక సాధారణ వృక్షం కాదు. అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, పర్యావరణ పరిరక్షణకు సహజ రక్షకుడు, వేలాది కుటుంబాల…

Read More