సాతులూరు వద్ద కాలేజీ బస్సు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

నాదెండ్ల: మండల పరిధిలోని సాతులూరు సమీపంలో హైవేపై గురువారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వస్తున్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో, డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న పుణుగుపాడు గ్రామానికి చెందిన అశోక్ (34), సీతారామయ్య (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, ఒక వ్యక్తి బస్సు టైరు కింద పడిపోగా, అతడిని బస్సు కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. సమాచారం అందుకున్న నాదెండ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Share.
Leave A Reply