పల్నాడు లో యువతి కిడ్నాప్ కలకలం
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామ సమీపంలో యువతి కిడ్నాప్ కావడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
నరసరావుపేటలోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌లో పనిచేసే యువతి, పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కిడ్నప్ కు గురైనట్లుసమాచారం .
ముప్పాళ్ల గ్రామానికి చెందిన ఉయ్యాల చైతన్య 22 బాధితురాలు ప్రతిరోజూ నరసరావుపేట వెళ్లి తన పని ముగించుకుని సాయంత్రం వేళల్లో తిరిగి గ్రామానికి చేరుకుంటుంది.
ఈ క్రమంలోనే, రొంపిచర్ల మండలం తుంగపాడు సమీపంలోకి రాగానే యువతి కిడ్నాప్ కు గురైనట్లు సమాచారం ,.
యువతి ఇంటికి చేరుకోకపోవడం మరియు స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన రొంపిచర్ల పోలీస్
ఘటనా స్థలాన్ని పరిశీలించి, తుంగపాడు – నరసరావుపేట మార్గంలోని సీసీటీవీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు రొంపిచర్ల పోలీసులు
నిందితులు ఏ దిశగా వెళ్లారనే కోణంలో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది



