శ్రీ దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం పురస్కరించుకొని శ్రీ దత్త స్వామికి ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం మహిళా భక్తుల సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సాయికి హారతులు సమర్పించి ప్రదక్షిణలు చేసినారు అనంతరం వేములకొండ సుబ్బారావు గారి ఆర్థిక సహకారంతో వారి మనవడు చిన్మయి సహకారంతో భక్తులకు అన్నసంతర్పణగా జరిగింది అనంతరం ట్రస్టు నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ గురుపౌర్ణమి రోజు జరిగే అన్నసంతర్పణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ధన కనక వస్తు వాహన రూపం లో సహకరించాలని కోరారు , గురుపౌర్ణమి రోజున ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని ముఖ్యంగా అఖండ జాతక గురువుల హోమ పూజ చాలా ముఖ్యమైనదని ఈ పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ షిరిడీ నుండి తెచ్చిన డాలర్లు ఇష్టంగా అందజేయబడతాయని తెలియజేశారు,అనంతరం భక్తులు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి శిరిడి సాయి చాలీసా సామూహికంగా పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో వేములకొండ సుబ్బారావు దాసరి కోటేశ్వరరావు క నమర్లపూడి నాగేశ్వరరావు తదితర భక్తులు పాల్గొన్నారు
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



