[5:14 PM, 5/11/2025] aapstatekapunadu99: పల్నాడు జిల్లా పోలీస్
నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి SRKT నందు కార్డెన్ సెర్చ్ …
ఈ రోజు తెల్లవారుజామున పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి SRKT నందు కార్డెన్ & సెర్చ్ నిర్వహించిన పోలీసులు...
నరసరావుపేట డి.ఎస్.పి అయిన నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 సిఐ లు,14 మంది ఎస్సైలు, పోలీసు సిబ్బంది మరియు ANS సిబ్బందితో కలిసి ఈరోజు తెల్లవారుఝామున 4.30 గంటల నుండి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు…
ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 41 మోటార్ సైకిల్లు, 1 కారు,1 ఆటో 10 రాడ్లు,కత్తులు పోలీసులు గుర్తించారు …ఈ కార్డెన్ సెర్చ్ లో భాగంగా సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 41 మోటార్ సైకిల్లు, 1 కారు,1 ఆటో 10 రాడ్లు,కత్తులు పోలీసులు గుర్తించారు …
నరసరావుపేట రూరల్ పోలీస్టేషన్ పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్డెన్ & సెర్చ్ కార్యక్రమం చేపడుతున్నట్లు శ్రీ డీఎస్పీ గారు తెలిపారు.
పల్నాడు జిల్లా నరసరావు పేట సబ్ డివిజన్ నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నట్లు డిఎస్పీ నాగేశ్వర రావు గారు తెలిపారు.
ఈ కార్డెన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నందు డీఎస్పీ నాగేశ్వర రావు గారు, నరసరావు పేట 1వ పట్టణ సి.ఐ M.V. చరణ్ గారు,నరసరావు పేట 2వ పట్టణ సి.ఐ హైమారావు గారు,నరసరావు పేట రూరల్ సి.ఐ P.రామకృష్ణ గారు, ట్రాఫిక్ సిఐ Ch.లోకనాథం గారు,
ఎస్సై లు మరియు ఇతర పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ANS సిబ్బంది పాల్గొన్నారు.



