Author: chilakaluripetalocalnews@gmail.com

పెద్దఎత్తున సంక్షేమం అందిస్తోన్న ఏకైక నాయకుడు చంద్రబాబే : ప్రత్తిపాటి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా అండగా ఉంటానన్న మాటకు ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టుబడ్డారని, పేదల సేవలో పేరిట ప్రతినెలా 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తూ పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారిలో ఆత్మస్థైర్యం, విశ్వాసం పెంచుతున్నారని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. గురువారం ఆయన నియోజకవర్గంలో పలు గ్రామాలు, వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. తొలుత పట్టణంలోని 13, 17 వార్డుల్లో, పేదలోసేవలో పాల్గొన్న ప్రత్తిపాటి. తరువాత చిలకలూరిపేట మండలం కోమటినేని వారి పాలెం, గంగన్న పాలెం, నాదెండ్ల మండల కేంద్రంలో పేదల ఇళ్లకు వెళ్లి, స్వయంగా సామాజిక పింఛన్లు పంపిణీ చేసి, లబ్ధిదారులతో మాట్లాడారు. పింఛన్లు అందించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజల్ని ఆదుకోవడంలో చంద్రబాబు వెనకడుగు వేయడం లేదు..దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమం…

Read More

సేవా సంకల్ప్ అభియాన్ లో పాల్గొన్న ప్రత్తిపాటి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోని 7వ వార్డులో స్థానిక బీజేపీ నాయకులు అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో కలిసి ఆయన స్థానిక మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు పెదబాలశిక్ష మరియు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జార్వార్ ఆడక స్వాములు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ కరిముల్లా, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, గట్టా హేమ, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read More

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సీతాదేవి గారు పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఏసు రత్నం జిల్లా బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. గౌరవనీయులైన పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి,పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్.విషయం: జిల్లాలో 22-A నిషేధిత భూముల జాబితాను సమగ్రంగా పునఃపరిశీలించి, అర్హత ఉన్న ప్రైవేట్/పట్టా భూములను నిషేధిత జాబితా నుండి తొలగించి, భూ యజమానుల సమస్యలను పరిష్కరించవలసిందిగా వినతి.సంబంధిత చట్టం: Registration Act, 1908 లోని Section 22-A.సూచన: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా G.O.Ms.No.444, Revenue (Registration-I) Department, dated 22-07-2026, అలాగే 22-A భూములపై గతంలో జారీ చేసిన ప్రభుత్వ…

Read More

గణపవరం జాతీయ రహదారిపై స్పీడ్ బారికేడ్ల ఏర్పాటు నాదెండ్ల: నాదెండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గణపవరం జాతీయ రహదారిపై వాహనాల అతివేగాన్ని అరికట్టి, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. సీఐ సుబ్బ నాయుడు ఆదేశాల మేరకు ఎస్ఐ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఏఎస్ఐ రమేష్, రైటర్ అనిల్ సిబ్బందితో కలిసి రోడ్డుపై రిఫ్లెక్టర్లతో కూడిన స్పీడ్ బారికేడ్లను (డ్రమ్ములను) సోమవారం ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో సైతం వాహనదారులకు స్పష్టంగా కనిపించి వారిని అప్రమత్తం చేసేలా ఈ డ్రమ్ములకు రేడియం స్టిక్కర్లు, లైటింగ్ సదుపాయాన్ని అమర్చారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితమైన వేగంతో వాహనాలు నడిపి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Read More

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సీతాదేవి గారు పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి ఏసు రత్నం నరసరావుపేట బిజెపి నాయకులు సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు విషయం : 2026 ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు మరియు పంటల నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, కరువు ప్రభావిత మండలాలను శాస్త్రీయంగా, క్షేత్రస్థాయిలో సమగ్రంగా గుర్తించి అధికారికంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని వినతి. 2026 ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సకాలంలో పడకపోవడం, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం…

Read More

పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం లో భాగంగా డిఆర్ఓ గారికి పది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ పై ఫిర్యాదు పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ పరిధిలో ఏ ఎం జి ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ అరుణ్ కుమార్ మహంతి ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి ఎమ్మార్వో ద్వారా తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి అలాగే మున్సిపల్ కార్యాలయం ద్వారా ఇంటి పన్ను వేయించి చిలకలూరిపేట సబ్ రిజిస్టర్ ని మేనేజ్ చేసి ఏడుగురు పేరు మీద ప్రభుత్వానికి సంబంధించిన సర్వే నెంబరు 138/1 సుమారు 10 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అమ్మే వేయడం కొన్నవారు మరల అమ్మకానికి చూపగా అలాగే ఆ స్థలంలో ఉన్న బిల్డింగులు పడవేస్తున్నారు పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వ అధికారులు అందరి పై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు…

Read More

పల్నాడు జిల్లా జనతా వారది కార్యక్రమం నరసరావుపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారది కార్యక్రమంలో స్థానికగా ఉన్న సమస్యలు ఫిర్యాదులు రావడం వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా ప్రయత్నం చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనత వారది పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షురాలు సీతాదేవి గారు పల్నాడు జిల్లా జనతా వారిది మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Read More

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల శివ నాగేశ్వరావు అచ్చంపేట మండల అధ్యక్షులు కొండిశెట్టి సత్యనారాయణ పల్నాడు జిల్లా జనతా వారది మీడియా ఇన్ఛార్జి కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారికినరసరావుపేట పల్నాడు జిల్లా విషయం: ఆంధ్రప్రదేశ్‌లో క్రీడలకు ప్రోత్సాహం – విద్యార్థుల సమగ్ర అభివృద్ధి – ప్రైవేట్ పాఠశాలల్లో క్రీడలకు ప్రాధాన్యత – కేంద్ర ప్రభుత్వ క్రీడా నిధుల సమర్థ వినియోగం – AP Sports Policy 2024–29 అమలు – “ఆడుదాం ఆంధ్ర”లో జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ – రాష్ట్రంలో ఆధునిక మల్టీ-స్పోర్ట్స్ మౌలిక వసతుల అభివృద్ధిపై వినతి. భారతీయ…

Read More

కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అభినందనలు చిలకలూరిపేట: కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్‌ను అధినేత, గౌరవనీయులు శ్రీ మల్లెల శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ శ్రీ మర్రి రాజశేఖర్ చేతుల మీదుగా నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన బాలు నాయక్, వైస్ ప్రెసిడెంట్ శివ సాయిరాం, జనరల్ సెక్రెటరీ షైక్ జానీబాషా , అప్పారావు, ఉపాధ్యక్షులు శామ్యూల్, కార్యదర్శి వెంకట్, జనరల్ సెక్రెటరీ ప్రసాద్ నాయక్, ఎక్సక్యూటివ్ మెంబర్ నాగెండ్ల కోటేశ్వరరావుతో పాటు కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ సభ్యులకు ఎమ్మెల్సీ శ్రీ మర్రి రాజశేఖర్ అభినందనలు తెలిపారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి, జర్నలిస్టుల సంక్షేమానికి అసోసియేషన్ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చప్పిడి బాలస్వామి, గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు. యూనియన్ రిజిస్టర్ నెంబర్: 183/2019

Read More

చిలకలూరిపేటలో దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యేకు వినతి చిలకలూరిపేటలోని 52 ఎకరాల స్థలంలో దేవాలయ నిర్మాణం చేపట్టేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు వినతి పత్రం సమర్పించారు. దేవాలయ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం కోసం ఎండోమెంట్ కమిషనర్‌తో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారికి సిఫార్సు లేఖ అందించాలని కోరుతూ పీజీఆర్‌ఎస్‌లో వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్మాణానికి అవసరమైన సహకారం అందించి, సంబంధిత అధికారులకు సిఫార్సు చేయాలని పత్తిపాటి పుల్లారావును మల్లెల శివ నాగేశ్వరరావు కోరారు.

Read More