ది.29-5-2026 వ తేదిన పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ‘జనతా వారధి’ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 1 గంటలకు ముగింపు చేయడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లెపు కృపారావు గారు పాల్గొని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది పాల్గొన్న నాయకులు: ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు శ్రీ వల్లెపు కృపారావు గారు జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్చార్జి కోమటి వాసు మరియు బిజెపి నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు కార్యక్రమనికి…
Author: chilakaluripetalocalnews@gmail.com
శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పలనాడు జిల్లా అధ్యక్షుడు శ్రీ ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈ వారం జనత వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల పరిధిలోని గుర్రం వారి పాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది. పొలానికి వెళ్లే రహదారిలో మూడు కాలువలపై బ్రిడ్జి ల నిర్మాణం కొరకు, కొత్తలూరు పంచాయతీకి వెళ్లే రహదారి నిర్మాణం కొరకు, ఉపాధి హామీ పనులు నిధుల జమ కొరకు, గ్రామంలోని సైడ్…
ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రజల దినచర్యగా మారాలి : ప్రత్తిపాటి ప్రజల భాగస్వామ్యం, వారి బాధ్యతాయుత పనితీరుతోనే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతాయని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన చిలకలూరిపేటలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో పాల్గొన్నారు. స్వయంగా చీపురు పట్టిన ప్రత్తిపాటి.. స్థానిక నాయకులతో కలిసి రోడ్డు శుభ్రం చేశారు. అనంతరం ఒక కూడలిలో తాటిముంజలు అమ్ముతున్న చిన్నారులతో మాట్లాడి, ఎక్కడి నుంచి వచ్చారు. తాటికాయలు ఎక్కడ తెచ్చారు.. అన్నీ అమ్మితే ఎంత లాభం వస్తుందని వారిని ప్రశ్నించగా, పిల్లలు ఉత్సాహంగా ప్రత్తిపాటికి సమాధానమిచ్చారు. అనంతరం వారి వద్ద ముంజలు కొనుగోలు చేసి రుచిచూసిన ప్రత్తిపాటి బాగున్నాయని వారిని మెచ్చుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలు తమ సొంతపనులుగా భావించాలిఅనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అయినా.. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర అయినా ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతాయన్నారు. ప్రభుత్వం వీధులు, పట్టణాలు, గ్రామాల శుభ్రతను ఒక ప్రాజెక్టులా నిర్వహిస్తోందని,…
పల్నాడు జిల్లా కార్యాలయంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి అనుమతి తో బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే “జనతా వారధి కార్యక్రమం” పల్నాడు జిల్లా కార్యాలయం లొ మే 22 తేది శుక్రవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ మండలం నుండి వేమా ఏడుకొండలు పిర్యాదు ఇవ్వడం జరిగింది. తనను ఒక వ్యక్తి మోసం చేసి లక్షల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది. ఈ విషయంపై ఈపూరు మండల ఎస్సై గారితో మాట్లాడి త్వరగా తనకు న్యాయం చేయాలని బిజెపి నుంచి డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ…
శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ,పార్టీ ఆదేశాల మేరకు, ఈవారం జనతా వారధి కార్యక్రమాన్ని ,శావల్యాపురం మండలంలోని తుమ్మలకుంట గ్రామంలో నిర్వహించడం జరిగింది. గ్రామస్తులు పొలాలకు వెళ్లేటువంటి రహదారులు అద్వాన్నంగా ఉన్నాయని రైతులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని ఎన్ ఆర్ ఈ జి ఎస్ పథకం కింద ఈ పొలాలకు వెళ్లే రహదారులు నిర్మించాలని దరఖాస్తు ఇవ్వడం జరిగింది అలాగే గ్రామంలోని ఎస్సీ కాలనీకి విద్యుత్ సరఫరా పూర్తిస్థాయిలో రావడంలేదని లో వోల్టేజీ సమస్యతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నామని దరఖాస్తు ఇవ్వడం జరిగింది . ఈ సమస్యల పరిష్కారం కొరకు బిజెపి తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు మరియు స్థానిక బిజెపి నేతలు సిద్దయ్య ఆంజనేయ ప్రసాద్ పాల్గొన్నారు
విషయం : రాష్ట్రవ్యాప్తంగా చెరువు మట్టి తవ్వకాలపై నిబంధనలు కచ్చితంగా అమలు చేయుట, గత పాలనలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టుట, రైతులకు మరియు కుమ్మరి వృత్తిదారులకు చెరువు మట్టిని ఉచితంగా అందించుట – వినతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1.13 లక్షల చెరువులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నిలుస్తున్నాయి. చెరువులు సాగునీటి వనరులు మాత్రమే కాకుండా భూగర్భ జలాల పునరుద్ధరణ, చేపల పెంపకం, వర్షపు నీటి నిల్వ, గ్రామ పర్యావరణ సమతౌల్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చెరువుల్లో సంవత్సరాలుగా పేరుకుపోయే పూడికను తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. సాగునీటి అందుబాటు మెరుగుపడుతుంది. భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి. రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతుంది. అయితే, భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంతో గ్రామాల్లోకి పర్యటనలు చేస్తూ ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తుంది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంది. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం…
భారతీయ జనతా పార్టీ – పల్నాడు జిల్లా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, అలాగే పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే “జనతా వారధి కార్యక్రమం” పల్నాడు జిల్లా కార్యాలయం లొ మే 15 తేది శుక్రవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పల్నాడు జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వినుకొండ పిడుగురాళ్ల నుంచి ఫిర్యాదులు రావడం వాటిని రాష్ట్ర పార్టీ ఏర్పాటు చేసిన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ అధికారులకు పంపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా విజయ భాస్కర్ రెడ్డి గారు పల్నాడు జిల్లా…
సాతులూరు వద్ద కాలేజీ బస్సు ఢీకొని ఇద్దరు యువకుల మృతి నాదెండ్ల: మండల పరిధిలోని సాతులూరు సమీపంలో హైవేపై గురువారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వస్తున్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల బస్సు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో, డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న పుణుగుపాడు గ్రామానికి చెందిన అశోక్ (34), సీతారామయ్య (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే, ఒక వ్యక్తి బస్సు టైరు కింద పడిపోగా, అతడిని బస్సు కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లింది. సమాచారం అందుకున్న నాదెండ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
“ నీరు ఉంటేనే జీవితం ఉంటుంది విషయం : భూగర్భ జలాల రక్షణ, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ పారిశుద్ధ్యం, భవిష్యత్ నీటి భద్రత ప్రస్తుతం వాతావరణం లో వస్తున్న మార్పుల కారణంగా వర్షపాత సరళిలో అనిశ్చితి, పెరుగుతున్న భూగర్భ జల వినియోగం, ఎండిపోతున్న బోర్లు, క్షీణిస్తున్న చెరువుల సంఖ్య మరియు ఆయకట్టు ఇవన్నీ భవిష్యత్ తరాలకు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని సూచిస్తున్నాయి ఈ పరిస్థితులను అధిగమించడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నీటి భద్రత కల్పించడానికి రాష్ట్రంలో జలవనరుల సక్రమ నిర్వహణ మరియు భూగర్భ జల రీచార్జ్ కు ఇంకుడు గుంటలు (సోక్ పిట్స్, రీచార్జ్ పిట్స్), చెక్ డ్యాం లు, పెర్కొలేషన్ టాంక్ లు, రీచార్జ్ షాఫ్ట్ లు మొదలైన నిర్మాణాల విస్తరణ, నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో బోర్లు ఎండిపోతున్నాయి, వేసవిలో తాగునీటి కొరత, వ్యవసాయానికి నీటి సమస్యలు, మురుగునీటి నిల్వ, వర్షపు…
శావల్యాపురం మండలంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది జనతా వారిది కార్యక్రమాన్ని శావల్యాపురం మండలంలోని భాస్కర్ నగర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మంచినీటి పథకం కు మరమ్మత్తులు చేసి త్రాగునీరు సరఫరా చేయాలని, గ్రామం నుండి స్మశానానికి వెళ్లే రహదారి గోతులు మయంగా వర్షాకాలంలో బురదమయంగా మారిందని ఈ రహదారికి మరమ్మత్తులు చేయాలని, అలాగే గ్రామంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినటువంటి మాలపాటి లక్ష్మారెడ్డి అనే యువకుడికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తులు రావడం జరిగింది, వీటి పరిష్కారానికి బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అర్జీదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు సీనియర్ నాయకులు అన్నవరపు శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు.









