Author: chilakaluripetalocalnews@gmail.com

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృషి నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తమ నియోజకవర్గ ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నారు. శుక్రవారం నరసరావుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన స్థానిక ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలతో వచ్చిన నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేకు తమ అర్జీలను అందజేశారు. ఈ కార్యక్రమం ప్రజలకు తమ సమస్యలను నేరుగా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించింది.ఈ ప్రజావేదిక కార్యక్రమం నరసరావుపేట నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకోవడానికి మరియు వాటిని పరిష్కరించడానికి ఒక సమర్థవంతమైన వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్థానికుల నుంచి స్వీకరించిన వినతి పత్రాలలో రోడ్ల మరమ్మతు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు, విద్యుత్ సరఫరా, భూ సంబంధిత వివాదాలు, మరియు సంక్షేమ పథకాల…

Read More

తుబాడులో పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య నాదెండ్ల మండలం, తుబాడు గ్రామంలో విషాదం నెలకొంది. కొల్లి పార్వతి (24 సంవత్సరాలు) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది ఆమె భర్త పోలు రాజు.గురువారం, జూలై 17, న ఉదయం తన ఇంట్లోనే పార్వతి పురుగుల మందు సేవించింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి .

Read More

మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఎన్నికైన అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన షేక్ కరీముల్లా గారు…చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన షేక్ కరీముల్లా ( టీడీపీ కరీముల్లా ) గారు, మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా చైర్మన్ గా ఎన్నికైన కరీముల్లా గారిని ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు వివిధ హోదాల్లోని నాయకులు సత్కరించి అభినందించారు, కరీముల్లా గారు మాట్లాడుతూ నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని తెలిపారు…ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మానం వెంకటేశ్వర్లు గారు, నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, గుర్రం నాగపూర్ణాచంద్రరావు గారు, కందుల రమణ గారు, మద్దిరాల సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు…

Read More

1200 ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్ల పరిధిలో నూతనంగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుచిలకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పటివరకూ మొత్తం 242 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో 239 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఎన్నికల అనంతరం ఎన్నికల సంఘం వారు తీసుకున్న చర్యల మేరకు 1500 ఓటర్లు పైబడి ఉన్న పోలింగ్ కేంద్రాలు స్థానంలో కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.పట్టణ పరిధిలో 3 పోలింగ్ కేంద్రాలలో 1500 ఓటర్లు పైబడి ఉన్న కారణంగా నూతనంగా 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిన కారణంగా, ప్రస్తుతం 242 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఇటివల ఎన్నికల సంఘం వారు తీసుకున్న చర్యలలో భాగంగా 1200 ఓటర్లు పైబడిన పోలింగ్ కేంద్రాలలో సైతం నూతనంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్న మార్గదర్శకాల మేరకు పట్టణంలో 27 పోలింగ్ కేంద్రాలు, చిలకలూరిపేట రూరల్ మండలం పరిధిలో 4 పోలింగ్ కేంద్రాలు, నాదెండ్ల…

Read More

వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో ‘బాబు ష్యూరిటీ …మోసంగ్యారంటీ’ కార్యక్రమం సూపర్‌ సిక్స్‌ హామీల అమలుపై ప్రశ్నిస్తూ బహిరంగసభ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీలను అమలు చేయాలంటూ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ మోసం – గ్యారంటీ’ పేరుతోఈ రోజు గురువారం (జూలై 17) కార్యక్రమం నిర్వహించనున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు మాజీ మంత్రి విడదల రజిని నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఉదయం 10 గంటలకు ఎన్‌ఆర్‌టీ రోడ్డులోని మాజీ మంత్రి విడదల రజిని నివాసం వద్ద ప్రారంభం అయ్యే ఈ బహిరంగ సభలో వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు, సత్తెనపల్లి సమన్వయకర్త గజ్జెల సుధీర్‌భార్గవ్‌రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్‌ పరిశీలకులు పూనూరు గౌతమ్‌రెడ్డి, మాజీపార్లమెంట్‌ సభ్యులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ,అధికార ప్రతినిధి…

Read More

అధికారం కోసం అడ్డగోలుగా హామీలిచ్చిన జగన్.. ముఖ్యమంత్రి కుర్చీ దక్కగానే ప్రజల నోట్లో మట్టికొట్టాడు : ప్రత్తిపాటి ఏం చేసైనా.. ప్రజల్ని ఎంతగా మోసగించైనా, ఏ విధంగా ఏమార్చైనా సరే ముఖ్యమంత్రి కావాలన్న దురాశతో జగన్ 2019లో ప్రజలకు అడ్డగోలుగా హామీలిచ్చాడు. ఏ ఊరికి వెళ్తే.. అక్కడి సమస్య పరిష్కరిస్తానన్నాడు. కొన్నిచోట్ల ప్రజలు అడగకుండానే వారి మెప్పుకోసం నోటికి పనిచెప్పాడు. తీరా అధికారం దక్కగానే హామీలన్నింటినీ కట్టగట్టి తాడేపల్లి ప్యాలెస్ లో అటకెక్కించాడు. అలాంటి వ్యక్తి నేడు నిస్సిగ్గుగా 80శాతం హామీలు అమలుచేసిన చంద్రబాబును హామీలపై ప్రశ్నిస్తున్నాడు. ఏరుదాటే దాక… ఏటిమల్లన్న. దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా 2019 ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించిన జగన్.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే.. వారికి ముఖం చాటేశాడు. ఎక్కడ తాను చెప్పిన వాటిపై తనను నిలదీస్తారోనన్న భయంతో పరదాలు.. పోలీసు పహారాల మధ్య దాక్కొని పాలన చేశాడు. చంద్రబాబు 143 హామీలిచ్చాడని…

Read More

పల్నాడు జిల్లాలో రైళ్లలో తిరుగుతున్న నకిలీ TTE పట్టివేత మచిలీపట్నం నుండి ధర్మవరం వెళుతున్న ఎస్ప్రెస్ రైల్లో జనరల్ బోగీల్లో తనికీలు నిర్వహిస్తున్న నకిలీ టీటీఈ అదే రైల్లో తనికీలు నిర్వహిస్తున్న గుంటూరుకి చెందిన అసలు టిటీఈ జాన్ వెస్లీకి తారసపడ్డ నకిలీ టీటీఈ టీటీఈగా గుర్తింపు కార్డు చూపాలని నకిలీ టీటీఈని ప్రశ్నించిన జాన్ వెస్లీ విధుల్లో ఉన్న జాన్ వెస్లీతో వాదనకు దిగిన నకిలీ టీటీఈ రైలు నరసరావుపేటకి రాగానే దూకి పరారైయ్యేందుకు ప్రయత్నం నరసరావుపేటలో నకిలీ టీటీఈని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం నరసరావుపేట రైల్వే పోలీసుల అదుపులో ఉన్న నకిలీ టీటీఈ కొన్ని రోజులుగా టీటీఈగా చెలామణి అవుతూ రైళ్లలో తిరుగుతున్న నిందితుడు అవినాష్ కృష్ణ గుప్తా అనే వ్యక్తి నకిలీ టీటీఈగా అవతారం ఎత్తాడని నిర్దారణకు వచ్చిన రైల్వే పోలీసులు అవినాష్ కృష్ణ గుప్తా గతంలో బిలాస్ పూర్ పరిధిలో రైల్వే గార్డుగా పనిచేసి…

Read More

శివాపురంలో ‘సుపరిపాలన’ ప్రచారం లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి గారు ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో “సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం” కార్యక్రమo వినుకొండ మండలం, శివాపురం గ్రామంలో ఈ కార్యక్రమo లో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు పాల్గొన్నారు. జీవి గారు గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన ఆవశ్యకతపై ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. “ప్రతి ఒక్కరికీ సుపరిపాలన ఫలాలు అందాలనేదే మా ప్రభుత్వ సంకల్పం. దీనిలో భాగంగానే ఈ ఇంటింటి ప్రచారం చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో : మంత్రి అచ్చం నాయుడు గారు, చీఫ్ విప్ జీవి గారు మంత్రివర్యులు రవి గారు అద్దంకి నియోజకవర్గం, సంతమాగులూరు మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు గారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు పాల్గొన్నారు. రైతుల సంక్షేమం, మార్కెట్ యార్డ్ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి అచ్చం నాయుడు గారుపిలుపునిచ్చారు. జీవి గారు మాట్లాడుతూ, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు, యరక్షన్ బాబు గారు, రైతులు, నాయకులు, ప్రజలు సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

ప్రత్తిపాటి ఆదేశాలతో పార్టీలకు అతీతంగా వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు:మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని చిలకలూరిపేట: స్థానిక పురపాలక సంఘ పరిధిలోనీ వివిధ వార్డులలో జరుగుతున్నఅభివృద్ధి పనులు,మరియ మంచినీటి సరఫరా పై ప్రజల నుంచి వచ్చిన విన్నతలను స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీమంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పట్టణాభివృద్ధి పై జరిపే ప్రతి సమీక్ష సమావేశంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.ఆయా సమీక్ష సమావేశాలకు కొంతమంది కౌన్సిల్ సభ్యులు హాజరైన హాజరు కాక పోయినపార్టీలకు అతీతంగా రాగద్వేషాలకు పోకుండా, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని వారి ఆదేశానుసారం పట్టణ ప్రాంతాల్లో ఉన్న అన్ని వార్డుల పరిధిలో పార్టీలకు అతీతంగా రోడ్లు , డ్రైనేజీ లు, కల్వర్టులు, పైపు లైన్ మరమ్మతులు.నూతన పైపు లైన్…

Read More