సనాతన ధర్మంలో వసంత పంచమికి విశేష ప్రాధాన్యత ఉంది.
వసంత పంచమి అనేది హిందూ పంచాంగం ప్రకారం.. శుక్ల పక్షం పంచమి తిథి నాడు వచ్చే పవిత్ర పండుగ. జ్ఞానం, విద్య, కళలు, సంగీతం వంటి కళలకు అధిష్టాన దేవత అయిన సరస్వతీదేవిని ఈ రోజు పూజించడం పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు వసంత ఋతువుని ప్రారంభంగా కూడా పరిగణిస్తారు. అందువల్ల ఇది ఆనందం, ఆశ, సృజనశీలతలకు ప్రతీకగా కూడా భావిస్తారు.
జ్ఞానం కొరవడితే.. జీవితం చీకటి మాయమవుతుంది. అలాంటి అజ్ఞానాన్ని తొలగించి మనకు సన్మార్గాన్ని చూపేది సరస్వతీదేవి తత్వమే. సకల కళలకు ఆదిదేవత అయిన సరస్వతీదేవిని పూజించడం ద్వారా లౌకిక, అలౌకిక జ్ఞానం ప్రాప్తిస్తుంది.అటువంటి చదువుల తల్లి అనుగ్రహం మీపై ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటూ హిందూ బంధువులు అందరికి వసంత పంచమి శుభాకాంక్షలు.



