పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు & వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారు హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ,ఉపాధి కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ముందుకు వెళ్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే వినుకొండలో మెగా జాబ్ మేళా నిర్వహించి వందలాదిమంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహించే జాబు మేళ ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ విప్ జీవి గారు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Author: chilakaluripetalocalnews@gmail.com
చిన్నారి అక్షితను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ పురుషోత్తపట్నం గ్రామ ప్రముఖ నాయకులు బైరా వెంకట కోటి గారి మనుమరాలు ( ఈదుపల్లి అంకా రమేష్ గారి కుమార్తె ) నూతన వస్త్ర బహూకరణ వేడుక సాయిబాబా దేవాలయంలోని ఫంక్షన్ హాల్ నందు జరుగుచుండగా ఆ వేడుకకు హాజరై చిన్నారి అక్షితను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు… ఈ వేడుకలో వారితో బైరా శేషాద్రి నాయుడు గారు, బైరా శేఖర్ గారు, తోట వెంకట బ్రహ్మ స్వాములు గారు, గ్రంధి ఆంజనేయులు గారు తదితరులున్నారు.
ప్రముఖ నటుడు, సేవావేత్త సోనూసూద్ ని కలిసిన మాజీమంత్రి ప్రత్తిపాటి నటనతోనే కాకుండా సేవా కార్యక్రమాలతోనూ నటుడు సోనూసూద్ ప్రజల మనసుల్లో నిలిచారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్లో మాజీమంత్రి నటుడు సోనూసూద్ తో మర్యాదపూర్వకంగా సమావేశమై సేవా కార్యక్రమాలపై మాట్లాడారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి సోనూసూద్ కి వివరించారు. తాజాగా చిలకలూరిపేట పట్టణంలో ప్రత్తిపాటి ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత నేత్రవైద్య శిబిరం గురించి సోనూసూద్ కి ప్రత్తిపాటి తెలియచేశారు. వేలమందికి నేత్రవైద్యసేవలు అందించడంపై సోనూసూద్ సంతోషం వ్యక్తంచేసి, ప్రత్తిపాటిని అభినందించారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించింది.. ఇన్నేళ్లలో ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు ఏ విధమైన సేవలు అందించిందనే వివరాల్ని ప్రత్తిపాటి ప్రజంటేషన్ ద్వారా సోనూసూద్ కి వివరించారు.
రామచంద్ర స్వామి వార్ల ప్రతిష్ఠా మహోత్సవంలో జీవి ఆంజనేయులుపాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం, యోగిరెడ్డిపాలెం గ్రామo లో శ్రీసీతారామలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వార్ల ప్రతిష్ఠా మహోత్సవంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు పాల్గొన్నారు. జీవి గారు మాట్లాడుతూ, యోగిరెడ్డిపాలెం గ్రామంలో దేవాలయ నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్ఠాపన గ్రామస్తుల భక్తికి, ఐక్యతకు నిదర్శనమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.తీర్థ ప్రసాదాలు అందజేశారు.
వైసీపీ నుండి తెలుగుదేశం లోకి చేరిన కుంభా బాబు చిలకలూరిపేట నియోజకవర్గం అభివృద్ధి చేయటం ప్రత్తిపాటి పుల్లారావుకే సాధ్యమని, బడుగుబలహీన వర్గాలకు న్యాయం జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ తోనే సాధ్యమని మురికిపూడి గ్రామంలో ఎస్టీ కాలనీ కీ చెందిన వైసీపీ నాయకుడు కుంభా బాబు, వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీ లోకి మండల పార్టీ అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్ , గ్రామ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో చేరడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు చెన్నుపాటి నాగరాజు , చిగురుపాటి రాజు , కోనకి నాగ మహేంద్ర , కొమ్మనబోయిన రామారావు , షేక్ శ్రీను భాషా , ఉయ్యాల తిరుపతయ్య , ఉయ్యాల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ మంత్రి విడదల రజిని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని వైయస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి విడదల రజిని అబద్దపు హామీలతో అధికారం లోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహించనున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలుకులు గౌతమ్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ రఫాని అధ్యక్షత న జరిగిన కౌన్సిల్ సమావేశం హాజరైన 38 వార్డుల కౌన్సిలర్ లు… పలు అంశాలపై కొనసాగుతున్న చర్చ కౌన్సిలర్ లకు గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించిన కౌన్సిలర్లు , అధికారులు తీరుపై ఆగ్రహం సమావేశం ప్రారంభం గాక ముందే….7వ వార్డ్ కౌన్సిలర్ పార్వతి మాట్లాడుతూ వార్డ్ లో ఒక రోడ్ వేయాలని గత మూడు నెలలు నుంచి అడుగుతున్నా…ఇంత వరకు ఆ పని చేయలేదని ఆరోపించారు. ఈ విషయం పై DE రహీం సమాధానమిచ్చారు.రోడ్ నిర్మాణానికి టెండర్లు పిలవడం జరిగిందని పేర్కొనగా,,, చైర్మన్ రఫాని కలగజేసుకొని ఏప్రిల్ నెలలో పనులు ఏమైనా చేశారా… లేదా అని అధికారులు ను ప్రశ్నించారు… DE రహీం …ఏప్రిల్ నెలలో పనులు చేశామని తెలపడంతో… మరీ ఆ పనులు చేసి నప్పుడు… కౌన్సిలర్ పార్వతి చెప్పిన పని ఎందుకు చేయలేదు అని చైర్మన్ మండిపడ్డారు. ఆ తదుపరి ఏజండాలోని అంశాలను…
అమ్మవారి పూజల్లో మున్సిపల్ చైర్మన్ రఫాని ఘన స్వాగతం పలికి న ఆలయ కమిటీ సభ్యులు చిలకలూరిపేట పట్టణంలోని 13వ వార్డు నందు శ్రీశ్రీ శ్రీ గాయత్రి సామెత విరాట విశ్వకర్మ వరిసిద్ధి వినాయక స్వామివార్ల దేవస్థానం ద్వితీయ వార్షికోత్సవం . ఈ సందర్భంగా జరుగుతున్న పూజా కార్యక్రమాలలో పాల్గొన్నా మున్సిపల్ చైర్మన్ రఫాని . సాయంత్రం జరుగు అన్నదాన కార్యక్రమం ఏర్పాట్లు గురించి…గుడి వారితో చర్చించిన మున్సిపల్ చైర్మన్ షేక్.రఫాని.
చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నందు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఓబిసి బిజెపి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు గారి సూచనతో పుణ్యక్షలోక అహల్యబాయి హోల్కర్ గారి 300 శతజయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఆమెకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి రాజ్య పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించి అనేక పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చి 300 సంవత్సరాల క్రితమే మంచి పరిపాలనధ్యక్షురాలుగా మంచి మంచి పేరు ప్రఖ్యాతలుగాంచిన ఆమె చరిత్రను ఈనాటి ప్రజలు అందరూ తెలుసుకోవాలని తెలియజే సారు ఈ త్రి శత జయంతి ఉత్సవ కార్యక్రమాలలో పట్టణ మాజీ అధ్యక్షులు తడబడ పుల్లయ్య ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు పట్టణ ఓబిసి అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపురెడ్డి లక్ష్మణ్ ఆరో వార్డు మైనారిటీ యువ నాయకులు షేక్ సుభాని ఆఫీస్ సెక్రటరీ…
తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ 82 వ పుట్టినరోజు. ఈ సందర్భంగా , …చిలకలూరిపేట కృష్ణ మహేష్ యువత హెల్పింగ్ పీపుల్స్ సొసైటీ అధ్యక్షులు ఇ.శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు కళామందిర్ సెంటర్ లో పట్టణ కృష్ణ మహేష్ యువత కమిటీ గౌరవ అధ్యక్షులు SK. నాసర్ వలి యాచుకులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగినది









