పల్నాడు జిల్లా, పోలీసు కార్యాలయంనరసరావుపేట.

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్…

★ ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 81 ఫిర్యాదులు అందాయి.

★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని శ్రీ ఎస్పీ గారు సూచించారు.

★ రాజుపాలెం మండలం కోట నెమలిపురి గ్రామానికి చెందిన సరికొండ శివ రంగనాయకుల రాజు పిడుగురాళ్ల కు చెందిన జానీ మస్తాన్ అను రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ద్వారా పిడుగురాళ్లలోని ఎరపతి నగర్ కరాలపాడు గ్రామానికి చెందిన మడేల శ్రీనివాసరెడ్డి అనే అతనికి చెందిన 3 1/2 సెంట్ల లో గల డాబా యింటిని 33,00,000/- రూపాయల కు మాట్లాడుకున్నట్లు, విడతల వారీగా శ్రీనివాస్ రెడ్డికి 20,30,000/- లు ఇచ్చి అతని చే స్వాధీన అగ్రిమెంట్ రాయించుకున్నట్లు,వ్రాయించుకున్న తరువాత సదరు స్థలంలో గల ఇంటికి మడేల శ్రీనివాస్ రెడ్డి పేరు పై ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేవు అని తెలిసి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ మాట్లాడుకొనగా ఫిర్యాదుకు డబ్బులు ఇస్తానని వాయిదాలు పెట్టి అనేకసార్లు ఇవ్వకుండా వేధించినట్లు, మడేల శ్రీనివాసరెడ్డి భార్య అయిన రాధిక ఫిర్యాదుతో “మేము నీకు డబ్బులు ఇవ్వము నీ దిక్కున చోట చెప్పుకో” అని దూషించి నేను ఎస్సీ కులానికి చెందిన దానిని నీపై ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని,నన్ను బలాత్కారం చేయబోయాడని రేప్ కేసు పెడతానని బెదిరిస్తున్నట్లు, కుట్రపూరితంగా తప్పుడు పత్రాలు చూపించి మోసం చేసినందుకు గాను మడేల శ్రీనివాసరెడ్డి మరియు అతని భార్య రాధిక పై చట్టపరమైన తీసుకోవలసిందిగా శ్రీ ఎస్పీ గారిని కలిసి ఫిర్యాది అర్జీ ఇవ్వడం జరిగింది.

👉 నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన చిలుకా రాజు ఇంటర్మీడియట్ పూర్తి చేసినట్లు, ఫిర్యాదికి తన స్నేహితుడైన అనిల్ కుమార్ ద్వారా మాన్ పవర్ ఏజెన్సీ, ముంబై అతను పరిచయమైనట్లు, ఆ పరిచయం మీద రాజీబ్ వారితో ఫిర్యాదిని మరియు అతని స్నేహితుడైన సునీల్ కుమార్ ను రష్యాకు పంపుతానని, తనకు మాన్ పవర్ సప్లై చేసే ఏజెన్సీ ఉన్నదని వర్కింగ్ ఇప్పిస్తానని నమ్మపలకగా ఫిర్యాదు అతని మాటలు నమ్మి వీసా కొరకు రెండు లక్షలు ఇచ్చినట్లు, అయితే ఫిర్యాదికి మరియు అతని స్నేహితుడైన సునీల్ కుమార్ కు వీసా వచ్చిందని చెప్పగా రాజీబ్ మాటలు నమ్మి ఫిర్యాది మరియు అతని స్నేహితుడు ది.26.03.2025న ముంబైకు వెళ్ళినట్లు,
సదరు రాజీబ్ ఫేక్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వారి సెల్ కు పంపగా ఫిర్యాదు మరియు అతని స్నేహితుడు ఎయిర్ పోర్ట్ లో టికెట్ చూపించగా అది ఫేక్ టికెట్ అని బయటకు గెంటి వేసినట్లు, తదుపరి ఎన్నిసార్లు రాజీబ్ కు ఫోన్ చేసినను సమాధానం చెప్పకుండా విదేశాలకు పంపుతానని మోసం చేసినందుకు గాను న్యాయం కొరకు శ్రీ ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.

★ దాచేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన వేముల సుమలత గారి తల్లిదండ్రులకు ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. ఫిర్యాది తల్లి చనిపోగా ఫిర్యాది తండ్రి అయిన బూసి వెంకటరెడ్డి రెండవ వివాహం చేసుకున్నట్లు, వారికి సంతానం కలగనట్లు, ఫిర్యాదు తండ్రికి వెల్దుర్తి మండలంలోని మండాది గ్రామంలో రైస్ మిల్ మరియు డాబా ఇల్లు, ఖాళీ స్థలం ఉన్నట్లు వివాహ సమయంలో ఫిర్యాదికి ఇస్తాను అన్న వాటా పంపిణి చేయకుండా ఫిర్యాదుకు సంబంధించిన 25 సెంట్లు భూమిని రిజిస్ట్రేషన్ చేసి నప్పటికినీ దానికి సంబంధించిన 1బి, అడంగల్, పట్టాదార్ పాస్ బుక్ అతని వద్దనే పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నందుకు గాను తగిన న్యాయం కొరకు శ్రీ ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.

★ రెంటచింతల మండలం పాలువాయి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ఉమామహేశ్వరి అను ఆమెకు ఒక సంవత్సరం క్రితం పెండ్లి జరిపించినట్లు, వివాహం అనంతరం ఒక పాప జన్మించినట్లు, ఆడపిల్ల పుట్టడం ఇష్టం లేని భర్త అయిన తమ్మిశెట్టి గురవయ్య తమ్మిశెట్టి దాసు (మామ) తమ్మిశెట్టి రమాదేవి (అత్త) ముగ్గురు కలిసి కొట్టి హింసిస్తున్నట్లు, వరకట్నం తీసుకురావాల్సిందిగా వేధిస్తున్నందుకుగాను ఈ రోజు శ్రీ ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.

★బొల్లాపల్లి మండలం చక్రాయపాలెం గ్రామానికి చెందినటువంటి కేతావత్ సూర్య నాయక్ కు అదే గ్రామానికి చెందిన గతంలో లైన్ మెన్ గా పని చేస్తూ ప్రస్తుతం నరసరావు పేట లో పని చేయుచున్న మూడవత్ బాబు నాయక్ అను అతను ఫిర్యాదికి మరియు బాణావత్ రంజానాయక్ నకు పొలం మోటర్లు ఇప్పిస్తాను అని 1,90,000 తీసుకుని మోటర్లు ఇప్పించకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయవలసిందిగా శ్రీ ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.

★ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహయ సహకారాలు అందించారు

Share.
Leave A Reply