నియోజకవర్గ వైసీపీ నాయకత్వాన్ని నమ్మి మోసపోయే టీడీపీలో చేరాం: వైసీపీ మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థి షేక్ కరిమున్, ఆమెభర్త మాజీ కౌన్సిలర్ యూసఫ్ అలీ
- ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ ఛైర్ పర్సన్అభ్యర్థి, ఆమె భర్త
- నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ తోట రాజారమేశ్, కూటమి ఛైర్ పర్సన్ అభ్యర్థి శ్రీమతి తోట రాజరాజేశ్వరిల సమక్షంలో టీడీపీ కండువా వేయించుకున్న కరిమున్, యూసఫ్ అలీ.
- మైనారిటీలకు వైసీపీ మొదటినుంచీ ద్రోహంచేస్తూనే ఉంది : షేక్ కరిమున్, యూసఫ్ అలీ.
మోసపూరిత, దుష్ప్రచార రాజకీయాలకు పాల్పడుతున్నందునే వైసీపీని వీడి టీడీపీలో చేరామని, తొలుత పార్టీ ఒత్తిడితో ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ, కొద్దిరోజుల్లోనే వైసీపీ ప్రధాన నాయకుల వైఖరితో విసిగిపోయామని చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ వైసీపీ అభ్యర్థి షేక్ కరిమున్ పేర్కొన్నారు.
ఆదివారం రాత్రి ఆమె, తనభర్త మాజీ కౌన్సిలర్ యూసఫ్ అలీతో కలిసి ఎమ్మెల్యే ప్రత్తిపాటి, నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ తోట రాజారమేశ్, కూటమి ఛైర్ పర్సన్ అభ్యర్థి తోట రాజరాజేశ్వరి సమక్షంలో టీడీపీలో చేరారు. ముందుగా వైసీపీకి రాజీనామా చేసిన షేక్ కరిమున్, తన భర్తతో కలిసి స్వయంగా ప్రత్తిపాటి నివాసానికి వచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.., తమ ఇష్టపూర్వకంగానే టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యాయని, నియోజకవర్గ వైసీపీ నాయకత్వాన్ని నమ్మి తాము మోసపోయామని, మైనారిటీలకు ఆ పార్టీ మొదటి నుంచీ ద్రోహం చేస్తూనే ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్తిపాటి ఎంతగానో కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో పట్టణంలో రూ.310 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయితే, మున్సిపాలిటీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని మాజీ కౌన్సిలర్ యూసఫ్ అలీ తెలిపారు.
పట్టణ ప్రగతికి సహకరిస్తూ, కరిమున్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం : తోట రాజారమేశ్
నియోజకవర్గంలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే రోజు త్వరలోనే వస్తుందని, కూటమి ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నేత్రత్వంలో కష్టపడి పనిచేస్తామని జనసేన ఇన్ ఛార్జ్ తోట రాజారమేశ్ తెలిపారు. వైసీపీ ఛైర్ పర్సన్ అభ్యర్థి షేక్ కరిమున్ పట్టణ ప్రగతికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ, తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు ఆయన చెప్పారు. మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు.. నియోజకవర్గ అభివృద్ధికి అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తామని రాజారమేశ్ స్పష్టంచేశారు.



