భక్తిశ్రద్ధలతో పోలేరమ్మ, అంకమ్మ తల్లి తిరుణాళ్లు
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రదాత మండలనేని చరణ్ తేజ
నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని పడమర బజార్ వద్ద వేంచేసియున్న శ్రీ పోలేరమ్మ తల్లి మరియు అంకమ్మ తల్లి తిరుణాళ్లు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రదాత యువ నాయకులు మండలనేని చరణ్ తేజ హాజరయ్యారు.ముందుగా ఆలయానికి చేరుకున్న చరణ్ తేజకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆయన భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు చరణ్ తేజను దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు.గ్రామస్తులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో పడమర బజార్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.



