తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే జగన్.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు చేయిస్తున్నాడు : ప్రత్తిపాటి
- ప్రజా భీష్టాన్ని గుర్తించలేనివాడు..మీడియా సంస్థల సలహాలు,సూచనలు గౌరవించలేని వాడు రాజకీయాలకు అనర్హుడు : ప్రత్తిపాటి
“ తన పిచ్చిప్రతిపాదన మావిగన్ ను సొంతపార్టీ నేతలే వ్యతిరేకించడం.. దాంతో ప్రజల్లో తాను మరింత అభాసుపాలవుతానన్న అక్కసు, ద్వేషంతో పాటు, తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే జగన్ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలపై వైసీపీ శ్రేణుల్ని దాడులకు పురికొల్పాడు. పత్రికాస్వేఛ్చను అరచేతితో అడ్డుకునే జగన్ ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవు. అదికారంలో ఉన్నప్పుడు కూడా జగన్ ఇదేవిధంగా తప్పుడు రాతల నెపంతో జీవో నంబర్ 2430 ద్వారా మీడియా సంస్థల గొంతు నులిమే ప్రయత్నం చేసి, తన పతనానికి తానే బీజం వేసుకున్నాడు. ఒక పత్రిక, ఛానల్ యజమానిగా చలామణి అవుతున్న జగన్.. మీడియా సంస్థల ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని గుర్తించలేకపోవడం నిజంగా సిగ్గుచేటు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు..రాతలు నిప్పు కణికలు
ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన మీడియా వ్యవస్థల సలహాలు, సూచలను గౌరవించలేని వాడు. ప్రజా భీష్టాన్ని గుర్తించలేని వాడు, సత్యాన్ని.. నిజాన్ని అంగీకరించలేని వాడు ముమ్మాటికీ రాజకీయాలకు అనర్హుడే. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థ రాతలు.. వాటి యజమాని రాధాకృష్ణ పలుకులు కణకణమండే నిప్పుకణికలు. వాటిని గుప్పెట్లో దాచేసి, ప్రజల్ని ఏమార్చాలనే జగన్ ప్రయత్నాలు తనతో పాటు.. తన పార్టీని జనాగ్రహ జ్వాలలకు మసిచేస్తాయి. ” అని మాజీమంత్రి ప్రత్తిపాటి మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.



