శావల్యాపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ బిజెపి మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ గారు, పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచనల మేరకు, ఈ వారం “జనతా వారధి” కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మతుకుమల్లి గ్రామంలో స్థానిక బిజెపి నేత వజ్జా వెంకటేశ్వర్లు గారి నిర్వహణలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది, అందులో భాగంగ హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం కొరకు, పొలాలకు వెళ్లేటువంటి రహదారుల నిర్మాణం కొరకు, జలజీవన్ మిషన్ పూర్తిచేసి పంచాయతీకి అప్పగించడం కొరకు, పీఎం కిసాన్ రైతు భరోసా నిధుల మంజూరు కొరకు, వంటి అంశాలపై ఆరు దరఖాస్తులు రావడం జరిగింది వీటి పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అర్జిదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో స్థానిక బిజెపి నేతలు గ్రామస్తులు పాల్గొన్నారు

Share.
Leave A Reply