బొప్పూడి నక్షత్ర వనంలో హైకోర్టు న్యాయమూర్తి మొక్కలు నాటే కార్యక్రమం

​చిలకలూరిపేట (బొప్పూడి):
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, మొక్కలు నాటడం ద్వారానే భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించగలమని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ బొప్పూడి కృష్ణమోహన్ గారు పేర్కొన్నారు. శనివారం చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని “నక్షత్ర వనము”ను ఆయన తన సతీమణితో కలిసి సందర్శించారు.
​ఈ సందర్భంగా నక్షత్ర వనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వగ్రామంపై మమకారంతో పాటు, పర్యావరణం పట్ల ఇక్కడి ప్రజలు చూపుతున్న శ్రద్ధ అభినందనీయమని కొనియాడారు. నక్షత్ర వనం వంటి ఆధ్యాత్మిక మరియు పర్యావరణ మేళవింపు ఉన్న ప్రాంతాలు మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Share.
Leave A Reply