గెలుపు ఓటములకు అతీతంగా ప్రజలకోసం పోరాడే పార్టీ టీడీపీ: ప్రత్తిపాటి
చిలకలూరిపేట
- పార్టీపై విధేయత..ప్రజలపై విశ్వాసంతో పనిచేయడమే నాయకత్వ లక్షణం.
- స్థానిక సంస్థలు ఎప్పుడొచ్చినా ప్రజాక్షేత్రంలో టీడీపీనే గెలవాలి.
•టీడీపీ కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమంలో ప్రత్తిపాటి.
పట్టణం నుంచి గెలుపొందిన టీడీపీ కౌన్సిలర్లు అందరూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని, ప్రజాభిమానం…ఆదరణ పొందిన నాయకులను వారు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గడచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టణం నుంచి తెలుగుదేశం కౌన్సిలర్లుగా గెలుపొంది, ప్రస్తుతం పదవీకాలం పూర్తయిన వారికి ఉగాది పండుగను పురస్కరించుకొని టీడీపీ పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ప్రత్తిపాటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
పదవులకు అతీతంగా స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకై సమిష్టిగా పనిచేయండి..
పురపాలికల్లో ప్రత్యేక అధికారుల పాలన వచ్చినప్పటికీ, కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారంలో మునుపటిలానే సమర్థంగా పనిచేయాలని, 5, 6 నెలల్లో రాబోయే స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటినుంచే పార్టీ గెలుపుకోసం సమిష్టిగా పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు. టీడీపీ తరుపున గెలిచి, గత ప్రభుత్వంలో నాటి పాలకుల అరాచకాలపై కౌన్సిలర్లు అందరూ ధైర్యంగా పోరాడారని ప్రత్తిపాటి కొనియాడారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు, వేధింపులు.. కక్షసాధింపులు సహజమని, అన్నిటినీ తట్టుకొని మనల్ని ఆదరించిన పార్టీ, ప్రజలకోసం పనిచేయడమే నిజమైన నాయకత్వమని ప్రత్తిపాటి పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీని, ప్రజల్ని విడవకుండా నిలిచేవారే ఎప్పటికైనా రాజకీయాల్లో మనుగడ సాధించగలరని చెప్పారు. తాను అధికారంలో కంటే ప్రతిపక్షంలోనే ఎక్కువ సమయం ప్రజలకోసం నిలిచానని, ఉమ్మడి గుంటూరు జిల్లాలో పార్టీ పటిష్టత కోసం విరామం లేకుండా శ్రమించానని ప్రత్తిపాటి తెలిపారు. ప్రస్తుత కౌన్సిలర్ అభ్యర్థులే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని, ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని ప్రత్తిపాటి భరోసా ఇచ్చారు. పార్టీల గుర్తులతో, పార్టీలతో సంబంధం లేకుండా జరిగే ప్రతి ఎన్నికలో టీడీపీ విజయమే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు.
కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, టీడీపీ నాయకులు మురకొండ మల్లిబాబు, కొత్త కోటేశ్వరరావు, ముల్లా కరీముల్లా, షేక్ మస్తాన్ వలి, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.



