పంటల మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానంతోనే రైతులకు లాభాలు : ప్రత్తిపాటి

  • జగన్ ఐదేళ్లలో రైతులకు మొండిచెయ్యి చూపిస్తే, చంద్రబాబు వారికి అండగా నిలిచారు : ప్రత్తిపాటి.
  • పల్నాడు జిల్లాలో మూడు విడతల్లో 2.40 లక్షల రైతులకు రూ.455.43 కోట్ల సాయం అందించారు: ప్రత్తిపాటి.
  • కూటమి ప్రభుత్వ సాయం రైతుల సాగుఖర్చులకు ఉపయోగపడుతుంది. : ప్రత్తిపాటి
  • జగన్ రైతులకు మొండిచెయ్యి చూపిస్తే, చంద్రబాబు ఆపన్నహస్తం అందిస్తున్నారు : ప్రత్తిపాటి
  • ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్కరూపాయి రైతులకివ్వలేదు.. ఒక్క పనిముట్టు అందించలేదు : ప్రత్తిపాటి
  • వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కోలుకోలేని విధంగా జగన్ నష్టపరిచారు : ప్రత్తిపాటి
  • సబ్సిడీలు, రాయితీలతో పాటు, ఆర్థిక సాయం, యాంత్రీకరణ పరికరాలు, నాణ్యమైన విద్యుత్, గిట్టుబాటు ధర అందిస్తోంది : ప్రత్తిపాటి
  • రైతులు పంటమార్పిడితో అధికలాభాలు పొందవచ్చు. పచ్చిమిర్చి, మొక్కజొన్న, బొప్పాయితో లాభాలు పొందామని పలువురు రైతులు చెప్పారు : ప్రత్తిపాటి.
  • ఎంపీ లావు, జిల్లా కలెక్టర్ కృతికాశుక్లాతో కలిసి అన్నదాత సుఖీభవ సాయం అందచేసిన ప్రత్తిపాటి
  • వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించి, రైతలతో మాట్లాడిన ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్
  • గ్రీన్ హౌస్ లలో ఉద్యాన పంటలు సాగుచేస్తే అధిక లాభాలు వస్తాయి : ఎంపీ లావు
  • దేశంలో ఎప్పుడు విపత్తులు, సంక్షోభాలు వచ్చినా, ఎప్పుడూ ఆహార కొరత ఏర్పడకపోవడానికి రైతుల కష్టమే కారణం : ఎంపీ లావు
  • రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు అందించింది : లావు
  • పరిమితికి మించి రసాయనఎరువులు, హానికార పురుగుమందుల వాడకమే వాణిజ్య పంటల ఉత్పత్తులకు ధర లేకుండా చేస్తోంది : లావు
  • జిల్లా రైతాంగం గ్రీన్ హౌస్ లో ఉద్యాన పంటలు సాగుచేస్తే ఎక్కువ దిగుబడి.. లాభాలు అర్జించవచ్చు : లావు.
  • ఉద్యాన పంటల రైతులకే ఎక్కువ లాభాలు వస్తున్నాయి : కలెక్టర్ కృతికా శుక్లా
  • అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ సాయం అందిస్తాం : కృతికా శుక్లా

ఖరీఫ్ సాగుఖర్చులకు ప్రభుత్వం అందించిన అన్నదాత సుఖీభవ సాయం ఉపయోగపడుతుందని, దుక్కిదున్ని భూమిని సాగుకు సిద్ధం చేసే రైతులకు ప్రభుత్వసాయం మేలు చేస్తుందని, ఐదేళ్లు జగన్ రైతులకు మొండిచెయ్యి చూపిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వారికి అన్నివిధాలా అండగా నిలుస్తున్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం ఆయన నాదెండ్ల మండలం ఎండుగుంపాలెంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లాతో కలిసి రైతులకు అన్నదాత సుఖీభవ సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్లు రైతులతో మాట్లాడి, సాగువిధానాల గురించి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలపై రైతాంగానికి అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు హాజరైన రైతాంగాన్ని ఉద్దేశించి వారు ప్రసంగించారు
చంద్రబాబు నాయకత్వం..రైతులకు రక్షణ కవచం : ప్రత్తిపాటి
కూటమిప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని, చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర రైతులకు నిజంగా గొప్ప రక్షణ కవచమని ప్రత్తిపాటి తెలిపారు. జగన్ ఐదేళ్లపాటు రైతుల్ని నిలువునా మోసగించాడని, ఇస్తామన్నరూపాయి ఇవ్వకపోగా, కష్టపడి రైతులు పండించిన పంట ఉత్పత్తులకు కూడా గిట్టుబాటు ధర అందించలేకపోయాడని ప్రత్తిపాటి తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ తొలివిడత సాయం అందించారన్నారు. మూడు విడతల్లో కలిపి పల్నాడు జిల్లాలో 2.40 లక్షల రైతులకు రూ.455.43 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందచేసిందన్నారు. నేడు మూడోవిడత కింద రూ.135.48 కోట్లు అందించామన్నారు.

పంటమార్పిడితోనే రైతులకు లాభాలు..
పంటమార్పిడితో పాటు.. సాంకేతిక పరిజ్ఞానంతో సాగు వ్యయాన్ని రైతాంగం తగ్గించవచ్చని, అదనంగా లాభాలు పొందవచ్చని ప్రత్తిపాటి సూచించారు. పలువురు రైతులతో తాము మాట్లాడితే వారు వివిధ రకాల కొత్త పంటలతో లాభాలు పొందినట్టు చెప్పారన్నారు. పచ్చిమిర్చి, బొప్పాయి, మొక్కజొన్నతో ఈ ఏడాది బాగా లాభాలు వచ్చాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ముమ్మాటికీ రైతు పక్షపాత ప్రభుత్వమేనన్నారు.

రైతులు వ్యాపారుల్లానే ఆలోచించాలి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, రాయితీలతో రైతులు తమ సాగు భారాన్ని తగ్గించుకోవాలని, కొత్త సాగు విధానాలతో అధిక దిగుబడులు సాధించాలని ప్రత్తిపాటి సూచించారు. కష్టంతో పాటు.. పంట ఉత్పత్తుల విక్రయంలో రైతులు కూడా వ్యాపారుల్లానే ఆలోచించాలని, పెట్టేపెట్టుబడికి తగినట్టుగా లాభాలు పొందడంపై దృష్టి సారించాలని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు.

చమురు..గ్యాస్ సమస్యను కేంద్రం సమర్థంగా ఎదుర్కొంటోంది..
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తాత్కాలికమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రధాని మోదీ సమర్థ నాయకత్వం, ముందుచూపుతో సమస్యల్ని అధిగమిస్తున్నారని ప్రత్తిపాటి తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సమస్యపై మాట్లాడిన ఆయన.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కొంతమేర ఉందని, దాన్నికూడా కేంద్రప్రభుత్వం అధిగమిస్తోందన్నారు. సామాన్యుడిపై కొంతమేర భారం పడినప్పటికీ, ప్రభుత్వాలు సమస్యను పరిష్కరిస్తాయన్నారు.

2 లక్షల మంది రైతులకు ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు : ఎంపీ లావు
రాష్ట్రంలో 2 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు అందించి ఎప్పటినుంచో ఉన్న సమస్యను పరిష్కరించిందని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు తెలిపారు. ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని రైతులు సాగుకు మాత్రమే వినియోగించాలని ఆయన సూచించారు. దేశంలో ఎలాంటి విపత్తులు, సంక్షోభాలు తలెత్తినా.. ప్రజలకు ఆహారం అందించడంలో రైతుల సాయం మాత్రం ఎప్పటికీ మరువలేనిదని లావు కొనియాడారు. రైతుల కష్టమే మనందరి కడుపు నింపుతోందనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. అలాంటి రైతులకు కొంత చేదోడుగా ఉండాలనే కేంద్రసాయానికి, రాష్ట్రసాయం కలిపి మొత్తంగా ఏటా ప్రతి రైతుకు రూ.20వేల ఇన్ పుట్ సబ్సిడ సాయం అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ సాయాన్నిరైతులు సాగుకుమాత్రమే వినియోగించాలని లావు సూచించారు. ప్రభుత్వ ధృవీకరణ పొందిన కంపెనీల నుంచే నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు కొనాలని అప్పుడే రైతులు నష్టపోకుండా ఉంటారన్నారు. గ్యాస్ సరఫరాపై మహిళలు ఎవరూ ఆదుర్తా పడాల్సిన పనిలేదన్నారు.

రైతులతో పాటు మహిళలకు అందించే పథకాల్ని వారు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ కృతికా శుక్లా
ప్రభుత్వాలు రైతులతో పాటు మహిళలకు వివిధ పథకాలు, స్వయం ఉపాధి రుణాలు అందిస్తున్నాయని, వాటిని గ్రామీణ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. డ్రోన్ల వినియోగంతో సాగు భారం తేలికవుతుందని ముఖ్యంగా పురుగుమందుల పిచికారీ ఎంతో సులభమవుతుందని ఆమె తెలిపారు. రైతులు యాంత్రీకరణ పరికరాలతో సాగును తేలిగ్గా చేయవచ్చన్నారు. ఉద్యాన పంటలతో అధిక లాభాలు వస్తాయని, రైతులు వాటిసాగుకు అధిక ప్రాధాన్యమివ్వాలని ఆమె హితవుపలికారు.
ఈ కార్యక్రమంలో డిఏవో జగ్గారావు, సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరిముల్లా, మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, బీజేపీ నాయకులు మల్లెల శివనాగేశ్వరరావు, రైతు నాయకులు అంబటి సోంబాబు, గుర్రం నాగపూర్ణ చంద్రరావు, గట్టినేని రమేష్, గ్రామ నాయకులు గట్టినేని విజయ్ సాయి , గట్టినేని సుమంత్, గోరంట్ల కోటేశ్వరరావు, నందిగాం నాగబాబు, నెల్లూరి రామారావు, టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply