ఫిబ్రవరి 7, 8 న రాష్ట్రం గర్వించేలా కొండవీడు ఉత్సవాలు.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొలి శని, ఆదివారాల్లో అంగరంగ వైభవంగా కొండవీడు ఉత్సవాలు. ఫిబ్రవరి 10 నుంచి వేసవి ముగిసేవరకు కొండపై ప్రత్యేక టెంట్ లలో పర్యాటకుల రాత్రి బసకు ఏర్పాట్లు. కొండవీడు వైభవం. చరిత్ర, గొప్పతనం తెలిపేలా ప్రత్యేక గీతావిష్కరణ.. 5 వ తేదీన ప్రత్యేక కర్టెన్ రైజర్.

కొండవీడు ఉత్సవాలకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత, విశిష్టత, వైభవాలను గత ప్రభుత్వం విస్మరించింది. గతంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి సమక్షంలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి, మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇకపై ప్రతి ఏటా ఉత్సవాల నిర్వహించబోతున్నాము.

కొండవీడు ఉత్సవాల నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో, పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా గారితో కలిసి బుధవారం చారిత్రక ప్రదేశంలోనే సమీక్ష నిర్వహించాను. కొండవీడును సందర్శించిన జిల్లా కలెక్టర్ ఉత్సవాల ఏర్పాట్లు, పర్యాటకులకు కల్పించాల్సిన సౌకర్యాలపై విస్తృతంగా చర్చించటం జరిగింది.

Share.
Leave A Reply