పేట అభివృద్దికి శాశ్వత చిరునామ ప్రత్తిపాటి
మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి, ప్రజా సేవలో సుదీర్ఘ కాలం ఉండాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన.
జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్దికి శాశ్వత చిరునామగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నిలిచారని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు గురువారం ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఝాయుషు ఇవ్వాలని. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, ప్రజా సేవలో సుదీర్ఘ కాలం ఉండాలని” ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
సంవత్సర కాలంలోనే పట్టాలెక్కిన అభివృద్ది…
ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం, దాన్ని నెరవేర్చే చిత్తశుద్ది ఉంటే ఏ నాయకుడైనా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాడన్నది చరిత్ర చెబుతున్న నిజమని, అనునిత్యం ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల సాధనకోసం పాటుపడుతున్న వ్యక్తి మాజీ మంత్రి , ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుని బాలాజి చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై మరి కొన్ని రోజుల్లో ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో అతి ఈ స్వల్ప సమయంలోనే చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు తనదైన ముద్ర వేసుకున్నారని వెల్లడించారు. గతంలో తన హయాంలో కొనసాగి మధ్యలో వైసీపీ హయాంలో నిలిచిన అభివృద్దిని పట్టాలు ఎక్కించటానికి సిద్దమయ్యారన్నారు. ఎన్నుకున్న ప్రజలకు మంచి చేయలన్న చిత్తశుద్ది ఉన్నపుడు, లక్ష్యశుద్ది ఉన్నపుడు, సంకల్పశుద్ది ఉన్నపుడు అభివృద్ది పరుగులు పెడుతుందో అన్న విషయానికి ప్రత్తిపాటి నిదర్శనంగా నిలుస్తరన్నారు. అధికారంలోకి ప్రత్తిపాటి వచ్చి సంవత్సర కాలంలోనే ఎన్నో అపరిష్కృత సమస్యలకు పరిష్కారం చూపారని వివరించారు.
గత ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో అభివృద్ది శూన్యం..
గత ఐదేళ్ల పాలన కాలంలో ఏ ఒక్క చిన్న సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు సతమతమయ్యారని గుర్తు చేశారు. వీధి దీపాలు, కాల్వల్లో పూడిక, ఆక్రమణలు, తాగునీటి సమస్య ఇలా ప్రజల సమస్యలను పెడచెవిన పెట్టారని. తమ ఖర్మ ఇంతే అని ప్రజలు అష్టకష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుట్లో అధికారంలో ఉన్న కొంతమంది మాత్రం ప్రజా సమస్యలు గాలికి వదిలి దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలన్న కాంక్షతో ధనార్జనకు పాల్పడ్డారని, పొలాలు ఆక్రమించారని, రైతుల పేరుతో డబ్బులు కొల్లగొట్టారని, మట్టిని అమ్ముకున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ పేరుతో నిబంధనలను కాలరాసి పంట పొలాలను, పంట కాల్వలను ద్వంసం చేసి, పేదల భూములను కొల్లగొట్టి, గ్రానెట్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. చివరాఖరుకు చిలకలూరిపేట నియోజకవర్గాన్ని, ప్రజలను గాలికి వదలి గుంటూరుకు మకాం మారిస్తే, ఓటేసిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసి తగిన బుద్ది చెప్పారని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతో చిలకలూరిపేట నియోజకవర్గం రాష్ట్రంలో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు.