మహానాడు ను జయప్రదం చేయండి…. ఎమ్మెల్యే అరవింద బాబు….
27,28,29 తేదీలలో కడప నగరంలో జరగనున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనిఎమ్మెల్యే అరవిందబాబు తెలియజేశారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ యువనేత లోకేష్ సారధ్యంలో జరుగుతున్న మహానాడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు. పార్టీ శ్రేణులకు స్వయంగా లోకేష్ బాబు దిశా నిర్దేశం చేయనున్నారని అన్నారు. 40 సంవత్సరాల తర్వాత ఈ మహానాడులో లోకేష్ కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడనున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



