తిరంగ ర్యాలీలో అందరూ భాగస్వాములు కావాలి. కూటమి నాయకులు.

చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఉదయం కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన సైనిక దళాలకు సంఘీభావంగా రేపు అనగా సోమవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక యన్.ఆర్.టి. సెంటర్ లోని రైతు బజార్ ఎదురుగా ఉన్న మధర్ థెరిసా విగ్రహం నుండి గడియార స్థంభం వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్టు కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ప్రారంభించి పాల్గొన్నట్టు తెలిపారు. యుద్ధంలో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించిన భారత సైన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు, దేశ భక్తి గల ప్రతీ పౌరుడు పాల్గొని వీర జవానుల మృతికి, పహాల్గామ్ ఉగ్ర దాడి మృతులకు సంతాపం తెలుపుతూ, ఆపరేషన్ సింధూర్ ను విజయవంతం చేసిన మన సైన్యానికి, భారత ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తూ ప్రతీ ఒక్కరు జాతీయ జెండా చేతబట్టుకుని తిరంగా ర్యాలీలో వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన వలసినదిగా తెలియజేశారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, బీజేపీ నాయకులు పోట్రూ పూర్ణచంద్రరావు, టీడీపీ పట్టణ అధ్యక్షలు పఠాన్ సమాధ్ ఖాన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్ మోహన్, మద్దుమలా రవి, మాధవ్ సింగ్, సాంబశివరావు, దశరథ రామయ్య , గోల్డ్ సుభాని, జనసేన నాయకులు మునీర్, షేక్ భాషా, బీజేపీ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply