వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరెస్టులు సక్రమమా….

చట్టప్రకారం ఇప్పుడు చేసేవి అక్రమమా? : టీడీపీనేతలు

  • జగన్ హాయాంలో టీడీపీనేతల అరెస్ట్ లన్నీ చట్టప్రకారమే జరిగాయా రజనీ?
  • టీడీపీ బీసీనేతలు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, చింతకాయల అయ్యన్నపాత్రుడిపై తప్పుడు కేసులు పెట్టినప్పుడు రజనీ ఎందుకు మాట్లాడలేదు?
  • వాటర్ ప్లాంట్ ప్రారంభానికి వెళ్లిన ప్రత్తిపాటిని అడ్డుకొని, ఆయనపై తప్పుడు కేసులు పెట్టించినప్పుడు రజనీకి చట్టం గుర్తురాలేదా?
  • మోసగాడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ తో రాష్ట్రమే ఆందోళనకు గురవుతుందన్నట్టు రజనీ వ్యవహరించింది
  • బీసీమహిళలనని చెప్పుకునే ఓసీ రజనీ. బీసీలపై ఆమెది కపటప్రేమ.
  • శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ పై వైసీపీనేతల వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి
  • తన దోపిడీ కోసం ప్రశాంతమైన చిలకలూరిపేటను రజనీ అరాచకాలు, ఫ్యాక్షన్ అడ్డాగా మార్చింది

చిలకలూరిపేట నియోజకవర్గంలో రజనీ చేసిన అవినీతి, ప్రజలకు చేసిన మంచిపై ఆమె బహిరంగ చర్చకు రావాలన్న టీడీపీనేతలు

ఏ నోటీసులు ఇచ్చి గతంలో చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారో రజనీ చెప్పాలి : షేక్ కరిముల్లా (టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి)

తప్పుడు పనులు చేసిన వారిని కాపాడేందుకు మాజీమంత్రి రజనీ ప్రయత్నించడం సిగ్గుచేటని, వైసీపీ ప్రభుత్వం గతంలో ఏ నిబంధనల ప్రకారం తప్పుచేయని టీడీపీ నేతల్ని అన్యాయంగా అరెస్ట్ చేసిందో రజనీ చెప్పాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ కరిముల్లా ప్రశ్నించారు. మాజీముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబు అరెస్ట్ సమయంలో వైసీపీ ఎంత నిరంకుశత్వంగా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజానీకం చూసిందన్నారు. పల్నాడు జిల్లా ఆత్మకూరుకు వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకొని ఆయన ఇంటి గేటుకు తాళాలు వేయించింది మీరు కాదా అని కరిముల్లా ప్రశ్నించారు.

చిలకలూరిపేట నియోజకవర్గవ్యాప్తంగా ఎవరికి ఏ పని కావాలన్నా పర్సంటేజీలు వసూలు చేసిన ఘనత రజనీదని, ఆమె అవినీతి దాహానికి పోలీస్ శాఖ బలైందన్నారు. 5గురు సీ.ఐ లు ఏకంగా వీ,ఆర్ కు వెళ్లడమే అందుకు నిదర్శమని కరిముల్లా తెలిపారు. సొంత పార్టీకే తలనొప్పిగా మారిన రజనీ తీరు సహించలేకనే ఆమెను వైసీపీ అధిష్టానం గుంటూరుకు పంపిందన్నారు. ఆమె అవినీతి జాబితా చాంతాడును కూడా మించిపోతుందన్నారు.

ప్రత్తిపాటి శరత్ ను అరెస్ట్ చేయించినప్పుడు రజనీకి నిబంధనలు గుర్తు రాలేదేం? : గంగా శ్రీనివాసరావు (మున్సిపల్ ఫ్లోర్ లీడర్)

తన అక్రమ సంపాదనకు సహకరించిన వారిని పోలీసుల అరెస్ట్ చేయకుండా మాజీమంత్రి రజనీ వ్యవహరించిన తీరు సిగ్గుచేటని, చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలిచిన రజనీ.. తన కార్యకలాపాలకు వినియోగించుకున్న భవనానికి అద్దెకూడా కట్టలేదని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు తెలిపారు. రాజకీయాలతో సంబంధంలేని ప్రత్తిపాటి శరత్ ను అన్యాయంగా అరెస్ట్ చేయించినప్పుడు రజనీకి నిబంధనలు ఎందుకు గుర్తురాలేదని శ్రీనివాసరావు ప్రశ్నించారు. కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చిన సొంత పార్టీ ఎంపీపై రజనీ చేయించిన దాడి ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదన్నారు. రజనీ తన హాయాంలో పేట నియోజకవర్గానికి చేసిన మంచిపై బహిరంగ చర్చకు రావాలని శ్రీనివాసరావు సూచించారు.

రజనీ ఇప్పటికైనా తన తప్పులు ఒప్పుకుంటే ప్రజలు సంతోషిస్తారు : ముద్దన నాగేశ్వరరావు (యడ్లపాడు మాజీ మండలఅధ్యక్షులు)

శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాష్ట్రమే ఆందోళనకు గురవుతుందన్నట్టుగా రజనీ వ్యవహరించిందని, ఆమె చేసిన అరాచకాలు..దోపిడీ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని యడ్లపాడు మాజీమండలాధ్యక్షులు నాగేశ్వరరావు తెలిపారు. తన హాయాంలో రజనీ కుల రాజకీయాలకు తెరలేపి పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టిందన్నారు. ఆమె ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని రాజకీయ సన్యాసం తీసుకుంటే ప్రజలు సంతోషిస్తారని, అలా కాకుండా జేబులు కొట్టేసినవారిని, మోసగాళ్లని కాపాడే ప్రయత్నం చేస్తే ఆమె త్రీవంగా నష్టపోతుందన్నారు.

అప్పులు చేసి ప్రజల్ని మోసం చేసి పారిపోయిన శ్రీకాంత్ రెడ్డి, రజనీ పంచన చేరాకే కోటీశ్వరుడు అయ్యాడు : ఎం.వీ.రత్నారెడ్డి (టీడీపీ నాయకులు)

2019కి ముందు మానుకొండ శ్రీకాంత్ రెడ్డి ఎవరో నియోజకవర్గప్రజలకు తెలియదని, అప్పులు చేసి తన పొలం తాకట్టు పెట్టి యడ్లపాడులో ఒక సినిమా హాల్ నిర్వహిస్తూ వ్యాపారం పేరుతో ప్రజల్ని మోసగించాడని, అలాంటి వ్యక్తి తరువాత రజనీ పంచన చేరి కోటీశ్వరుడు అయ్యాడని టీడీపీ నాయకులు రత్నారెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నెలలోనే తాకట్టులో ఉన్న తన పొలం విడిపించుకొని, భారీ భవనం కట్టించాడని అంతసొమ్ము అతనికి ఎలావచ్చిందో రజనీ చెప్పాలని రత్నారెడ్డి డిమాండ్ చేశారు. శ్రీకాంత్ రెడ్డిని నమ్మి తాను డబ్బులు ఇచ్చి మోసపోయాయని, అతని అరెస్ట్ సమయంలో అతని బంధువు తనకు వీడియో కాల్ చేసి, తాను పెట్టిన కేసు వెనక్కు తీసుకోవాలని చెప్పాడన్నారు.

టీడీపీ బీసీ నేతల్ని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు బీసీ నాయకురాలినని చెప్పుకునే రజనీ ఎందుకు స్పందించలేదు? : తుపాకుల అప్పారావు (రాష్ట్ర బీసీ నాయకులు)

శ్రీకాంత్ రెడ్డిని పోలీసుల నుంచి రక్షించడానికి రజనీ గజకర్ణ,ఘోకర్ణ విద్యలు ప్రదర్శించిందని, బీసీ మహిళలనని చెప్పుకునే రజనీకి తాను మంత్రిగా ఉన్నప్పుడు బీసీలు గుర్తురాలేదా అని అప్పారావు ప్రశ్నించారు. టీడీపీ బీసీ నేతలు అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్ర, చింతకాయల అయ్యన్నపాత్రుడు, విజయ్, బుద్దావెంకన్నలపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడినప్పుడు రజనీ ఎక్కడుందన్నారు? రేపల్లెలో చిన్నారి అమరనాథ్ గౌడ్ ను అతికిరాతకంగా వైసీపీ వాళ్లు చంపినప్పుడు, నందం సుబ్బయ్యను హత్యచేసినప్పుడు, వేలమంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టినప్పుడు రజనీ ఆనాడు వైసీపీప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని అప్పారావు నిలదీశారు. రజనీ బీసీ కారని, బీసీనని చెప్పుకునే ఓసీఅని, బీసీలపై ఆమెది కపటప్రేమని, వెనుకబడిన వర్గాల ప్రజలు ఆమె మాటలు నమ్మరని అప్పారావు తెలిపారు.

తాను చేయించింది తప్పు కానప్పుడు ఇప్పుడు జరిగింది తప్పెలా అయిందో రజనీ చెప్పాలి : నెల్లూరి సదాశివరావు (నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త)

శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు రజనీకి మద్ధతుగా వైసీపీనేతలు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, తన దోపిడీకోసం ప్రశాంతంగా ఉండే చిలకలూరిపేటను రజనీ అరాచకాలు, దుర్మార్గాలు, ఫ్యాక్షనిజానికి నిలయంగా మార్చిందని నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సదాశివరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రజనీ… వైసీపీ నేతలు మాట్లాడారని, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను హైదరాబాద్ విమానాశ్రయంలో ఎలా అరెస్ట్ చేయించారో, విజయవాడలో ఎన్ని స్లేషన్లు తిప్పి వేధించారో రజనీ మర్చిపోయినా, నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేదన్నారు. అప్పుడు తప్పు కానిది, ఇప్పుడు తప్పెలా అయిందో రజనీ, ఆమెకు మద్ధతు పలికిన వైసీపీనేతలు చెప్పాలని సదాశివరావు డిమాండ్ చేశారు. పట్టణ ప్రజలకు తాగునీరు అందించే వాటర్ ప్లాంట్ పున:ప్రారంభానికి వెళ్లిన మాజీమంత్రి ప్రత్తిపాటిపై పోలీసులతో చేయించిన దాష్టీకంపై రజనీ సమాధానం చెప్పాలన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు రూ.5 కోట్ల వ్యయంతో ప్రత్తిపాటి ప్రారంభించిన వాటర్ ప్లాంట్ ను రజనీ కావాలనే పాడు పెట్టించారని, తిరిగి రూ.60లక్షల సొంత నిధులతో దాన్ని బాగుచేసి ప్రారంభించడానికి వెళ్లిన మాజీమంత్రి ప్రత్తిపాటిని అడ్డుకొని, ఆయనపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించింది వాస్తవం కాదా అని, అలా చేయమని రజనీకి ఏం చట్టం చెప్పిందన్నారు. ఐ-టీడీపీ కో ఆర్డినేటర్ పిల్లికోటిని అన్యాయంగా అరెస్ట్ చేయించి, పోలీసులో చిత్రహింసలు పెట్టించి, పైశాచిక ఆనందం పొందింది రజనీ కాదా అని సదాశివరావు ప్రశ్నించారు. పవిత్ర పుణ్యక్షేత్రం కోటప్పకొండ తిరునాళ్లను కూడా రజనీ, ఆమె అనుచరులు రణక్షేత్రంగా మార్చి దౌర్జన్యాలకు తెగబడ్డారన్నారు. ఆనాడు రజనీ వ్యవహరించిన తీరుని, ఆమె చెప్పిందల్లా చేసిన పోలీసుల్ని ప్రశ్నించినందుకు ప్రత్తిపాటి, టీడీపీనేతలపై తప్పుడు కేసులు పెట్టమని ఏ చట్టం చెప్పిందని సదాశివరావు ప్రశ్నించారు. ఆనాడు తిరునాళ్ల ఘటనల్లో అరెస్ట్ చేసినవారిని కోర్టులో హాజరుపరచకుండా పోలీసులతో థర్డ్ డిగ్రీలు ప్రయోగించిన రజనీ, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నేరస్తుడైన శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ ను అడ్డుకున్నారో చెప్పాలన్నారు.

Share.
Leave A Reply