ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నీటి సమస్యకు చెక్‌

యడ్లపాడు మండలంలో చెంఘీజ్‌ఖాన్‌పేట పంచాయతీ బున్నీనగర్‌లో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ ఆఫ్‌ చిలకలూరిపేట ఆధ్వర్యాన జరిగిన సేవా కార్యక్రమంలో క్లబ్‌ డిస్ట్రిక్‌ చైర్మన్‌ ప్రేమలత హాజరయ్యారు. సోమవారం కాలనీ వాసులకు నీటి సమస్యకు పరిష్కారంగా అసిస్ట్‌ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌ను ప్రేమలత ప్రారంభించారు. అనంతరం క్లబ్‌ బ్రాండింగ్‌లో భాగంగా ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ చిహ్నాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. సమాజ సేవ..పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చిలకలూరిపేట ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ పనిచేస్తుందని ప్రేమలత పేర్కొన్నారు. క్లబ్‌ అధ్యక్షురాలు గట్టు సరోజిని మాట్లాడుతూ, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన, మహిళాభివృద్ధి కోసం క్లబ్‌ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాల విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో దాతలు జాస్టి ప్రమీల, మద్ది లలిత, డాక్టర్‌ గట్టు రంగారావు, డిస్ట్రిక్ట్‌ సెక్రటరీ జయశ్రీ, డిస్ట్రిక్ట్‌ ఎడిటర్‌ సుభాషిణి, పీడీఎస్‌ కోలా విజయలక్ష్మి, క్లబ్‌ సెక్రటరీ నార్నే జయలక్ష్మి, పాస్ట్‌ ప్రెసిడెంట్‌ టి రమాదేవి, సభ్యులు భారతీ, ఎం పద్మావతి, జి రత్న తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply