చిలకలూరిపేట పట్టణంలోని, రైతుబజార్ వద్ద బాషా గారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన రైతుబజార్ చాయ్ హౌస్ ను ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు… ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు షేక్ కరీముల్లా గారు, పఠాన్ సమద్ గారు, మురకొండ మల్లిబాబు గారు, ముల్లా కరీముల్లా గారు, అజార్ గారు, రసూల్ గారు, మరియు తదితరులు పాల్గొన్నారు…
Author: chilakaluripetalocalnews
మీడియా ఎప్పుడూ ప్రజల పక్షమేపత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని పురస్కరించుకొనిఏపీయూడబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలోసీనియర్ విలేకరి ఈనాడు ప్రసాద్‌కు ఘన సన్మానంఆర్ వి ఎస్ సి వి ఎస్ హై స్కూల్ ప్రాంగణంలో మొక్కలు నాటడంచిలకలూరిపేట: ప్రజాస్వామ్య మనుగడకు నాలుగోవ స్తంభంగా నిలిచే పత్రికలు, మీడియాకు అందులో పనిచేసే జర్నలిస్టులకు స్వేచ్చ అవసరమని ఆర్‌వీఎస్ సీవీఎస్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం అంతర్జాతీయ పత్రికా స్వేచ్చా దినోత్సవం సందర్బంగా ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్టు, సీనియర్ నటుడు వంకాయలపాటి ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉప్పలపాటి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రసాద్ ఈనాడు దినపత్రికలో అత్యధిక కాలం పనిచేసి అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లటానికి దోహదపడ్డారని, ఇటీవల నటనలో రాష్ట్ర ప్రభుత్వ కందుకూరి పురస్కారం కూడా అందుకున్నారని,…
చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామ మాజీ మునుసబు గోపాళం నాగేశ్వరావు గారి సతీమణి కుసుమాంబ గారు గత నెల 19 న స్వర్గస్తులైనారు. ఈరోజు వారి పెద్దకర్మ సందర్భంగా బొప్పూడిలోని వారి స్వగృహం నందు ఏర్పాటుచేసిన చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వాసు గారు… ఈ కార్యక్రమంలో వారితో *గోపాళం నాగేశ్వరరావు గారు, గుంటు సుబ్బారావు గారు, పూసల యోగేశ్వరరావు గారు, గోపాళం భాను ప్రసాద్ గారు* తదితరులున్నారు.
ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగాసీనియర్ పాత్రికేయులకు ఘన సన్మానం*అక్రిడేషన్ తో పని లేకుండా ఆరోగ్య భీమాలో అవకాశాలు కల్పించాలి*.*రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలతో గృహ నిర్మాణం చేపట్టి ఇవ్వాలి*.స్థానిక పాత్రికేయుల కుటుంబాలకు (ఐఎంఏ) ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నాయకులు ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశాలు కల్పించాలి.చిలకలూరిపేట: నిజాన్ని నిర్భయంగా,నిస్వార్థంగా తమ గళంతోనూ, కలంతోనూ ప్రపంచానికి తెలియజేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న పాత్రికేయ మిత్రులకు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలను తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు.పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఏలూరి సిద్దయ్య విజ్ఞాన కేంద్ర మందిరంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. సీనియర్ పాత్రికేయులు షేక్ అల్లా బక్షు, పిట్టల శ్రీనివాసరావులను ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమని ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛ హక్కులను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు హరించి వేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని…
చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలంలోని, యడవల్లి గ్రామానికి చెందిన చుండు రాము ( వాటర్ రాము ) గారి కుమారుని నూతన వస్త్ర బహుకరణ వేడుకకు హాజరై, ఆ అబ్బాయిని దీవించిన మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు… ఈ వేడుకలో తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు గారు, జవ్వాజి మదన్ గారు, పుటిగంపు వెంకటేశ్వరరావు గారు, మరియు మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు…