Author: chilakaluripetalocalnews@gmail.com

అట్టహాసంగా జాతీయ స్థాయిలో ఒంగోలు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభించిన..ప్రత్తిపాటి,గొట్టిపాటి, శ్రీ కృష్ణ దేవరాయలు చిలకలూరిపేట : స్థానిక గోల్కొండ గార్డెన్స్ ఆవరణలో పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ,ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలోపల్నాటి పౌరుషానికి ప్రతిక మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే ఎడ్ల పందేలను ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన మన అభిమాన నాయకులు మాన్యులు గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు.పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి యంగ్ అండ్ రెబల్ లీడర్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు.యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పల్నాడు జిల్లా పార్లమెంట్ సభ్యులు లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు ,… పోటీలు ప్రారంభించే ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తి శేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం..…

Read More

చిలకలూరిపేటలో సమర్త్ చేనేత ట్రైనింగ్ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ సాహు చిలకలూరిపేటలో చేనేతలకు ఉచితంగా సమర్త్ చేనేత కార్యక్రమం ప్రారంభం ఈరోజు చిలకలూరిపేట భావన ఋషి నగర్ లో చేనేత సమర్త్ ట్రైనింగ్ ప్రారంభించటం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీవర్స్ సర్వీస్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ సాహు ( సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్) ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ చేనేతలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా స్కీంలు ప్రవేశపెట్టి 15% నుంచి 100% వరకు సబ్సిడీ చేనేతలకు అందిస్తున్నది చేనేతలకు వృత్తి నైపుణ్యం పెంపొందించి వాళ్ళ అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు ట్రైనింగ్ 40 రోజులు జరుగుతునదని ట్రైనింగ్ అనంతరం వాళ్లకి ట్రైనింగ్ సర్టిఫికెట్స్ తొ పాటు వారికి 90% సబ్సిడీతో పరికరాలను అందిస్తారు,15% సిల్క్ అండ్ కాటన్ యారన్ ఇవ్వనున్నట్లు తెలియజేశారు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత చేనేత ముద్ర రుణాలను అందిస్తామని తెలియజేశారు…

Read More

చిలకలూరిపేట బస్టాండ్‌లో ‘టెండర్’ ప్రకారం అమ్మకాలు లేవు? నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు! చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో దుకాణదారుల మధ్య వివాదం ముదురుతోంది. నిబంధనల ప్రకారం వ్యాపారాలు సాగాల్సిన చోట, కొందరు అధికారుల అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఆరు నెలలుగా ఈ సమస్య కొనసాగుతున్నా, స్థానిక అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల పక్షపాత వైఖరి – బాధితుల ఆవేదనబస్టాండ్‌లో దుకాణాలు నిర్వహించే వారు నెలకు లక్షల రూపాయల అద్దెలు చెల్లిస్తున్నారు. అయితే, టెండర్ నిబంధనల ప్రకారం ఏ వస్తువులు అమ్మాలి, ఏవి అమ్మకూడదు అనే నిబంధనలను కొందరు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల నిబంధనలు పాటించే వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. “ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరొక న్యాయమా?” అంటూ బాధితులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ గొడవలు పలుమార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినా పరిష్కారం లభించలేదు.విచారణ పేరుతో కాలయాపన?మరో విచారకరమైన విషయం ఏమిటంటే,…

Read More

పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలో ప్రారంభమైన పల్నాడు జనతా వారిది కార్యక్రమం రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, ప్రజలకు ప్రభుత్వానికి వారధి- బిజెపి జనతా వారధికార్యక్రమాన్ని శావల్యపురం మండలం, వేల్పూరు పంచాయతీ పరిధిలోని, వెలమవారిపాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామస్తులు కొన్ని సమస్యల్ని మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ద్రుష్టికి తేవడం జరిగింది, ముఖ్యంగా దశాబ్దాలుగా పరిష్కారం కాని 45 ఎకరాల ఇనాం భూమిలకు సంబంధించి పాస్ పుస్తకాలు మంజూరు మరియు, రామాలయం ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు మార్గంలో, వీధుల్లో సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, అలాగే పెన్షన్లకు సంబంధించి అలాగే మరికొన్ని పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది,ఈ దరఖాస్తులను పరిష్కార పరిధని బట్టి ఆయా శాఖల పంచాయతీ, మండల, జిల్లా, రాష్ట్ర అధికారులకు ఇవ్వడం జరుగుతుంది, ఈ కార్యక్రమం ప్రతి గురువారం మండలంలోని ఒక గ్రామంలో నిర్వహించబడుతుంది ఈ…

Read More

భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది. భోగి రోజు సాయంత్రం పిల్లల తలపై రేగుపండ్లు, చిల్లర నాణేలు, అక్షతలు, పూలరేకులు కలిపి పోసే ఈ ఆచారం పిల్లలకు రక్షణ కవచంగా భావిస్తారు. ఈ ఆచారం వెనుక కారణం: భోగిపండ్లు పోయడం ఒక పురాతన ఆచారం, ఇది పిల్లల రక్షణ, ఆశీస్సులు, సంపద కోసం చేసే ఒక పవిత్రమైన ఆచారం.

Read More

వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి అమరావతి న్యూస్ చిలకలూరిపేట జగన్ మెప్పుకోసం వెంపర్లాడే క్రమంలో వైసీపీనేతలు రోజురోజుకీ విచక్షణా జ్ఞానం కోల్పోతున్నారు. ప్రజామోదం పొందిన పాలకుల నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో పలుచన అవుతున్నారు. పీపీపీ విధానంపై కోటిసంతకాల సేకరణ పేరిట ప్రజల్లో అభాసుపాలైనా వారిలో మార్పురాలేదు. భోగి మంటల్లో వైసీపీనేతలు దహనం చేసింది పీపీపీ జీవోలుకాదు.. ఏళ్లనుంచి వారిలో గూడుకట్టుకు పోయిన అసత్యాలు.. అబద్ధాలను. వైసీపీ నేతలు దహనం చేయాల్సింది పీపీపీ జీవోలు కాదు… తమలోని విద్వేష లక్షణాల్ని..వినాశకర ఆలోచనల్ని. ప్రజలు మెచ్చే పాలకుల నిర్ణయాలపై అసంతృప్తి.. తిరుగుబాటు, వైసీపీ సిద్ధాంతమా లేక జగన్ స్వార్థ రాజకీయమో ఆ పార్టీనేతలే చెప్పాలి. పీపీపీ మోడల్ సాధ్యాసాధ్యాలు, తద్వారా కలిగే ప్రయోజనాలపై కేంద్రం నియమించిన కమిటీసభ్యులుగా ఢిల్లీలో విధానాన్ని సమర్థించడం.. రాష్ట్రంలో వ్యతిరేకించడం వైసీపీ రెండు నాల్కల ధోరణి కాదా? మెడికల్…

Read More

14తేదీ భోగిపండుగ.. మనకు వచ్చే అనేక పండుగలలో ‘భోగిపండుగ’ను చాలా విశేషంగా చేసుకుంటాం.భోగం అనుభవించుట అంటే సుఖం అనుభవించుట అని అర్థం. ఈ భోగి పండుగ బాహ్యంలో చూస్తే శరీర పోషణార్థం కావలసినటువంటి పంటని, సుఖం అనుభవించడానికి కావలసినటువంటి ధనాన్ని చేకూర్చేటటువంటి రోజు గనుక దానికి భోగిపండుగ అని పేరు.ఈ ‘భోగి పండుగ’ వచ్చే సమయానికి వ్యవసాయ దారులు పంటలు కోతలు కోస్తారు. ఆ పంట అంతా ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చిన పంట జాగ్రత్తగా ధ్యాన్యాగారంలో నిలవ చేసి మళ్ళీ పంట వచ్చే పర్యంతము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఆ ఆహారాన్ని తింటూ జీవితాన్ని గడుపుతారు. అలాగే కొంత పంటని విక్రయించిన కారణం చేత లభించినటువంటి ధనంతో సుఖాలను అనుభవిస్తారు. భోగిపండుగ అని పిలవడానికి కారణం ఏమిటంటే మనిషి బాహ్యమునందు సుఖపడడానికి కావలసినటువంటి ధాన్యం అంతా వచ్చేటటువంటి కాలం. ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభ సూచనగా…

Read More

చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం లోని యడ్లపాడు మండలం, కొండవీడు గ్రామంలో అగ్ని హర్షిదాతు ఎమ్.ఏస్.ఎం.ఇ పార్క్ కు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆమోదం తెలిపారు. పల్నాడు జిల్లా కలెక్టర్ బంగ్లా లోని జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ ( డి.ఐ.పి.ఈ.సి) సమావేశం జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా అధ్యక్షతన జరిగింది.నానో టెక్నాలజీ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి, కావలసిన అన్ని అనుమతులను కేటాయిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, పెదకూరపాడు నియోజకవర్గాలలో త్వరగా పార్కులును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా పరిశ్రమల మరియు ప్రోత్సాహక కమిటీకి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ జి.ఎం బి. శ్రీనివాస్ రావు, పీ.సీ పల్నాడు జిల్లా అభివృద్ధి కమిటీ జి సుబ్బారెడ్డి, అసిస్టెంట్ కమర్షియల్ ఆఫీసర్ జి.…

Read More

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయం చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో ముప్పల హనుమంతరావు హాస్పటల్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా 163 వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది బిజెపి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రేరణ ప్రధానంగా ఆత్మవిశ్వాసం, సామాజిక సేవ, ఆత్మశక్తిని గుర్తించడం, మరియు నిరంతర కృషిపై ఆధారపడి ఉంటుంది; ఆయన యువతను తమలోని దివ్యత్వాన్ని గుర్తించి, లక్ష్యం కోసం నిరంతరం శ్రమించమని, సమాజానికి సేవ చేయమని, మతాల మధ్య సమన్వయాన్ని ప్రోత్సహించాలని బోధించారు, ఆయన జీవితం, బోధనలు భారతదేశ యువతకు మరియు ప్రపంచానికి స్ఫూర్తిదాయకం. లేవండి మేల్కొనండి లక్ష్యం చేరేంత వరకు విశ్రమించకండి ఇది ఆయన ప్రసిద్ధి నినాదం అని తెలిపారు, ప్రతి ఒక్కరూ తమలో అపారమైన శక్తిని…

Read More