శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు…

శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని 52 ఎకరాలు టిడ్కో గృహ సముదాయంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి మరియు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు ముఖ్య అతిథిగా హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

కమిటీ వారి ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరైన మర్రి రాజశేఖర్ గారికి కమిటీ సభ్యులు మల్లెల శివ నాగేశ్వరరావు గారు, నెల్లూరి ఈశ్వర్ రంజిత్ గారు, వరికూటి నాగేశ్వరరావు గారు, దడబడ పుల్లయ్య గారు, సింగరేసు పోలయ్య గారు వంకాయలపాటి వంశిధర్ గారు తదితరులు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో వారివెంట నిడమానూరు హనుమంతరావు గారు, నరేంద్ర రెడ్డి గారు, విజయ్ గారు తదితరులున్నారు.

Share.
Leave A Reply