అభిమానులకు, జనసైనికులకు ధన్యవాదాలు తెలిపిన:ప్రధాత మండలనేని చరణ్ తేజ
ప్రధాత తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ మండలనేని చరణ్ తేజ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా, వ్యక్తిగతంగా శుభాకాంక్షలు అందజేసిన వ్యాపారవేత్తలకు, జనసైనికులకు, వీర మహిళలకు, అభిమానులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
కుటుంబ సభ్యుల్లాంటి కార్యకర్తలు
“నాపై ఇంతటి అభిమానం చూపించి, నాపై నమ్మకంతో నా వెన్నంటే ఉండి నడిపిస్తున్న మీరందరూ నా కుటుంబ సభ్యులతో సమానం. మీ ఆదరాభిమానాలే నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన నమ్మకాన్ని కొనసాగిస్తానని, మీ అందరి అండదండలతో ప్రజా సేవలో ముందుంటానని” ఈ సందర్భంగా చరణ్ తేజ ఆకాంక్షించారు.



