కోటప్పకొండ ప్రసాదం పై మీడియాలో వస్తున్న కథనాలపై ఈవో చంద్రశేఖర్ వివరణ
దేవస్థానంలో ప్రసాదం నాణ్యతపై మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు పూర్తిగా అవాస్తవమని దేవస్థానం ఈవో చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు అందిస్తున్న ప్రసాదం శుభ్రత, నాణ్యత ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ తయారు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
దేవస్థానంలో తయారు చేసే ప్రసాదానికి అవసరమైన పదార్థాలు అన్నీ మంచి నాణ్యతతోనే కొనుగోలు చేసి, పరిశుభ్రమైన వాతావరణంలో తయారీ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షణ కూడా చేస్తున్నామని చెప్పారు.
కొన్ని సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను భక్తులు నమ్మవద్దని, దేవస్థానం పరిపాలన ఎప్పటికప్పుడు ప్రసాదం తయారీపై తనిఖీలు నిర్వహిస్తోందని ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు.
దేవస్థానం పరిపాలన భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని, ఎవరైనా అనుమానాలు ఉంటే నేరుగా దేవస్థానం అధికారులను సంప్రదించాలని సూచించారు.



