కంపోస్ట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరి బాబు..
చిలకలూరిపేట: పట్టణ పరిధిలోని మానుకొండవారి పాలెంలో ఉన్న మున్సిపల్ కంపోస్ట్ యార్డును మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన యార్డులోని చెత్త సేకరణ, విభజన ప్రక్రియను మరియు విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కంపోస్ట్ యార్డుల పాత్ర కీలకమని, ఎప్పటికప్పుడు సేకరించిన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో అలసత్వం వహించకుండా, పారిశుధ్య నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో కమిషనర్ వెంట డివిజన్-1 ఇన్చార్జి శానిటేషన్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ ఖాదర్, డివిజన్-2 శానిటేషన్ ఇన్స్పెక్టర్ సునీత ,మున్సిపల్ ఏ.ఈ ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



