చిలకలూరిపేట నియోజకవర్గం నుండి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా పల్నాడు జిల్లా రీజినల్ హెడ్ గారిని నరసరావుపేట బ్యాంకు లొ కలిసిన చిలకలూరిపేట బిజెపి నాయకులు
చిలకలూరిపేట నియోజకవర్గం నుండి బీజేపీ నాయకులు పల్నాడు జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ బ్యాంక్ హెడ్ రవికుమార్ గారిని నరసరావుపేట బ్యాంకు రీజినల్ కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన తరువాత స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గంలో చిన్న సన్నకార వ్యాపార వర్గానికి రుణాలు ఇవ్వవలసిందిగా రీజనల్ బ్యాంక్ హెడ్ ని బిజెపి తరఫున కోరడం జరిగింది వారు తప్పనిసరిగా చిలకలూరిపేట నియోజకవర్గంలో క్యాంపు ఏర్పాటు చేసి త్వరలో లోన్స్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర నాయుడు మైనారిటీ మోర్చా పట్టణ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జ్ వంకాయలపాటి వంశీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు



