పులివెందులలోని రౌడీ.. రాక్షస రాజ్యాన్ని ప్రజలు తరిమికొట్టబోతున్నారు : ప్రత్తిపాటి.

  • పులివెందులలో ఎప్పుడైనా ప్రజాస్వామ్యపద్ధతిలో ఎన్నికలు జరిగాయా?
  • అలా జరిగితే గెలవమని తెలిసే వైసీపీనేతలు అరాచకాన్ని నమ్ముకున్నారు.
  • ప్రజాసంక్షేమం..రాష్ట్రాభివృద్ధిలో చంద్రబాబు దేశానికే రోల్ మోడల్ గా నిలిచారు
  • ముఖ్యమంత్రి పనితీరు.. నాయకత్వంపై ప్రజానమ్మకమే కూటమిఅభ్యర్థుల్ని గెలిపిస్తుంది.
  • ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం.. పనితీరుపై ప్రజలకున్న నమ్మకమే కూటమిపార్టీలకు విజయాన్ని సాధించి పెడుతుందని, ఏ ఎన్నికైనా ప్రజలు తమకోసం పనిచేసే నాయకత్వాన్నే గెలిపిస్తారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా శనివారం ఆయన కూటమిపార్టీల అభ్యర్థి అద్దలూరి ముద్దుకృష్ణారెడ్డి తరుపున, మంత్రి ఎన్.ఎం.డీ ఫరూక్, శాప్ ఛైర్మన్ రవినాయుడుతో కలిసి రెండోరోజు స్థానికంగా విస్తృత ప్రచారం నిర్వహించారు.

ప్రజలు కూటమిప్రభుత్వ పక్షాన నిలిస్తేనే, రాష్ట్రంలో దోపిడీదారులకు స్థానం ఉండదు

గ్రామాల్లో ప్రచారం చేపట్టిన నేతలు.. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచి చంద్రబాబు నాయకత్వంలో ఏడాదిలో జరిగిన మంచిని..చేస్తున్న అభివృద్ధిని వివరించారు. తమ సంక్షేమం..సంతోషంకోసం పనిచేసే కూటమిప్రభుత్వం పక్షానే ప్రజలు నిలవాలని.. అప్పుడే రాష్ట్రంలో దుర్మార్గులు, దోపిడీదారులకు స్థానం లేకుండాపోతుందని తెలియచేశారు. ప్రచారంలో భాగంగా మాజీమంత్రి ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడారు.

రెండు ఉపఎన్నికల్లో విజయం కూటమి అభ్యర్థులదే.

జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనతో విసిగిపోయిన ప్రజలు, రౌడీరాజ్యాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరన్న ప్రత్తిపాటి.. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వైసీపీ గెలవదన్నారు. పులివెందులలో సాగుతున్న రౌడీ.. రాక్షస రాజ్యాన్ని తరిమికొట్డడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. గతంలో అక్కడ జరిగిన ఎన్నికలన్నీ ప్రజల ఆకాంక్షలు..అభిప్రాయాలకు విరుద్ధంగానే జరిగాయని ప్రత్తిపాటి చెప్పారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలో కూటమిపార్టీల అభ్యర్థులు ఘనవిజయం సాధించబోతున్నారని ప్రత్తిపాటి తెలిపారు.

ప్రజాసంక్షేమం… పరిమితుల్లేని అభివృద్ధిలో చంద్రబాబు దేశానికే రోల్ మోడల్

ప్రజలు మెచ్చేలా.. వారికి నచ్చేలా సంక్షేమపథకాలు అమలుచేయడంలో గానీ.. పరిమితులు లేని అభివృద్ధిలో గానీ చంద్రబాబు దేశానికే రోల్ మోడల్ గా నిలిచారని ప్రత్తిపాటి చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రం… కేంద్రపాలిత ప్రాంతంలో లేని సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి ఏపీలో అమలుచేస్తున్నారన్నారు. రూ.4వేల నుంచి రూ.15వేల వరకు సామాజిక పింఛన్లు అందించడం గానీ.. రూ.13వేల తల్లికి వందనం సాయంగానీ, అన్నదాతా సుఖీభవ కింద రూ.20వేలు అందివ్వడంగానీ.. ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. నిరుద్యోగ యువతకు త్వరలోనే నిరుద్యోగ భృతి కూడా అందివ్వనున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం అమలుచేయని రీతిలో పకడ్బందీగా కూటమిప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుచేయనుందన్నారు.

నాడు ఎన్టీఆర్ కూడు..గుడ్డ..నీడ.. నేడు చంద్రబాబు సూపర్-6 పథకాలు దేశానికే మార్గదర్శకాలు

టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ గతంలో పేదవర్గాలకు కూడు..గుడ్డ…నీడ అందించాలన్న సదుద్దేశంతో మంచి పథకాలు ప్రవేశపెట్టి, దేశానికే సరికొత్త సంక్షేమ పంథాను చూపారని ప్రత్తిపాటి కొనియాడారు. నేడు చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్-6 పథకాలు మొత్తం భారతావనికే మార్గదర్శకంగా నిలిచాయని, అన్నివర్గాల ప్రజలు మెచ్చేలా..వారికి మంచిజరిగేలా చంద్రబాబు పథకాలు అమలుచేస్తున్నారన్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా కూటమిప్రభుత్వం సకల జనుల సంక్షేమం అమలుచేస్తోందన్నారు. భవిష్యత్ లో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయపార్టీ అధికారంలోకి రావాలన్నా చంద్రబాబు పథకాల అమలుకే మొగ్గుచూపే పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రత్తిపాటి స్పష్టంచేశారు.

Share.
Leave A Reply