చిలకలూరిపేటలో తాసిల్దార్ షేక్ హుస్సేన్ కు విజ్ఞాపన పత్రం అందజేసిన జర్నలిస్టులు

అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డు మంజూరు చేయాలి

ఏపీయుడబ్ల్యుజే జిల్లా కమిటీ సభ్యులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అడపా అశోక్ కుమార్

స్టేట్ కౌన్సిల్ మాజీ సభ్యులు షేక్ మస్తాన్ వలి

చిలకలూరిపేట:రాష్ట్రవ్యాప్తంగా ఏపీయుడబ్ల్యూజే డిమాండ్స్ డే లో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు పిలుపు మేరకు చిలకలూరిపేటలో ఏపీయుడబ్ల్యుజే చిలకలూరిపేట శాఖ ప్రెస్ క్లబ్ తరఫున చిలకలూరిపేట తహసిల్దార్ మహమ్మద్ హుస్సేన్ కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. తాహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి నూతనంగా అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని, ఇంటి నివేసన స్థలాలు కేటాయించాలని,భీమా సౌకర్యం కల్పించాలని జర్నలిస్టుల కోరికలను వెంటనే అమలుపరిచేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యుజే జిల్లా కమిటీ సభ్యులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అశోక్ కుమార్ ,స్టేట్ కౌన్సిల్ మాజీ సభ్యులు షేక్ మస్తాన్వలి, మాట్లాడుతూ జర్నలిస్టుల న్యాయమైన కోరికలను వెంటనే ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సెక్రెటరీ షేక్ దరియా వలి, కొచ్చర్ల చందు,నాదెండ్ల సుందర్ బాబు, సాతులూరి బెంజిమెన్, అమ్మనబ్రోలు శివ నారాయణ, ఆంజనేయులు, కొండపాటి రమేష్,షేక్ సిద్ధిక్,యాసం రవి కిరణ్ , నరసింహుల శ్రీకాంత్, రావిపటి రాజా, తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply