రాష్ట్రప్రగతికి అడ్డుపడుతూ… తప్పుడు మెయిల్స్ పెట్టేవారు ప్రజలకు అవసరమా? : ప్రత్తిపాటి

  • రైతుల్ని ఏడిపించినందుకే జగన్ కు ప్రతిపక్షహోదా దక్కలేదు.
  • దుర్మార్గపు ఆలోచనలున్న నాయకుడు జగన్… ఆయనతో రాష్ట్రానికి, ప్రజలకు ఎప్పటికైనా ప్రమాదమే.
  • చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతుంటే, ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేసే జగన్ ను ఏంచేయాలో ప్రజలే చెప్పాలి.
  • సూపర్-6 అమలుతో జగన్ తట్టాబుట్టా సర్దుకొని దేశం విడిచిపోతాడు.
  • మనం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే సమాజం జగన్ చెప్పే చెడునే నమ్ముతుంది.

నేడు నియోజకవర్గంలోని 21,614 మంది రైతులకు అన్నదాతాసుఖీభవ కింద రూ.15.13కోట్లు అందించామని, కౌలురైతులు సహా ప్రతి రైతుకు ప్రభుత్వ సాయం తప్పక అందుతుందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. జగన్ రైతుభరోసా పేరుతో రైతుల్ని దగా చేశాడని, అరకొరగా కేవలం రూ.7,500లు మాత్రమే ఇచ్చాడని, మరోఏడాది రూ.6,500లతోనే సరిపెట్టాడన్నారు. కూటమిప్రభుత్వం ప్రతి రైతుకు ఏటా రూ.14వేలు ఇస్తుందని, కేంద్రసాయం రూ.6వేలు కలిపి మొత్తం రూ.20వేలు మూడువిడతల్లో అందిస్తుందని ప్రత్తిపాటి చెప్పారు. యడ్లపాడు మండల కేంద్రంలో నేడు ప్రభుత్వం సగర్వంగా ప్రారంభించిన అన్నదాతా సుఖీభవ పథకంలో భాగంగా రైతులకు చెక్కులు అందించిన ప్రత్తిపాటి అనంతరం వారితో కలిసి కాడెడ్లు, అరకలతో చేపట్టిన ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం రైతుల్ని ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు.

పెట్టుబడులు రాకుండా తప్పుడు మెయిల్స్ పెట్టేవారిని ఏంచేయాలో ప్రజలే ఆలోచించాలి

చంద్రబాబు రేయింబవళ్లు రాష్ట్రం కోసం శ్రమిస్తుంటే, పెట్టుబడులు, కంపెనీలు రాకూడదనే దురుద్దేశంతో తప్పుడు మెయిల్స్ పెట్టేవారిని ఏంచేయాలో ప్రజలే ఆలోచించుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. జగన్… వైసీపీ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా.. తాననుకున్నది పూర్తిచేసేవరకు చంద్రబాబు విశ్రమించరని ప్రత్తిపాటి తేల్చిచెప్పారు. సూపర్-6 ఆఖరి పథకం అమలుతో జగన్ తట్టాబుట్టా సర్దుకొని దేశం విడిచి పోవడం ఖాయమన్నారు. మంచి ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే సమాజం కూడా జగన్ చెప్పే చెడునే నమ్ముతుందన్నారు. దుర్మార్గపు ఆలోచనలుచేసే జగన్ వంటి వ్యక్తి రాష్ట్రానికి, ప్రజలకు ఎప్పటికైనా ప్రమాదమేనని ప్రత్తిపాటి తెలిపారు.

వైసీపీ నాయకులు ఎవరూ ప్రజలకు అండగా నిలవలేదు

కౌలురైతులకు ప్రభుత్వం త్వరలోనే గుర్తింపు కార్డులు అందించి, వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందించేలా చేస్తుందన్నారు. ముక్కూ ముఖం తెలియనివారిని తీసుకొచ్చి, వైసీపీ నియోజకవర్గంలో పోటీచేయిస్తోందని, వారంతా అడ్రస్ లేకుండా పోయారుతప్ప, ఎప్పుడూ ప్రజలకు అండగా నిలవలేదన్నారు. చేసిన అభివృద్ధి చెప్పకుంటూ, నిరంతరం ప్రజల మధ్య ఉండే నాయకత్వాన్ని మాత్రమే టీడీపీ ఆదరించి ప్రోత్సహిస్తోందన్నారు. మన గురించి, మన ప్రాంతం గురించి తెలియనివారిని గెలిపిస్తే, వారు స్వార్థం చూసుకుంటారు గానీ, ప్రజల గురించి పట్టించుకోరని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. టీడీపీ ప్రభుత్వాల్లో రాష్ట్ర్రానికి మంచిపేరు ఉండేదని, జగన్ పాలనలో రాష్ట్ర్ర పరువు, ప్రతిష్ఠలు పూర్తిగా మంటగలిశాయన్నారు.

జగన్ తప్పుడు విధానాల వల్లే రైతులకు భూసమస్యలు

జగన్ తప్పుడు నిర్ణయాలు, అనాలోచిత చర్యల వల్లే రైతాంగం ఇప్పటికీ భూసర్వే సమస్యలతో అధికారుల చుట్టూ తిరుగుతోందన్నారు. రైతుల ఉసురు తగిలే జగన్ 11 స్థానాలకు పరిమితమయ్యాడన్న ప్రత్తిపాటి. వ్యవసాయం గురించి అవగాహన లేనివారు రైతులకు మేలుచేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. కూటమిప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్లు తీసుకునే ప్రతి ఒక్కరూ ఓటేస్తే, కూటమిపార్టీలు భారీ విజయం సాధిస్తాయన్నారు. చంద్రబాబు వంటి సమర్థుడు ఉంటేనే రాష్ట్రానికి, తమకు మేలుజరుగుతుందని వైసీపీసానుభూతిపరులు కూడా ఆలోచించుకోవాలని ప్రత్తిపాటి సూచించారు. ఈ నెలాఖరుతో సూపర్ -6 హామీలన్నీ చంద్రబాబు అమలుచేస్తాడని, మిగిలింది ఆడబిడ్డ నిధి ఒక్కటేనని అదికూడా త్వరలోనే అమలవుతుందన్నారు. చంద్రబాబు అందించే సంక్షేమపథకాలు చూడలేక, కడుపుమంటతో జగన్ రాష్ట్రం వదిలిపోవడం ఖాయమన్నారు. టీడీపీ నాయకత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పి, పార్టీపై, అధినాయకత్వంపై సదభిప్రాయం కలిగించాలన్నారు. నాయకుల్లో ఐక్యత లేకే గత ఎన్నికల్లో నియోజకవర్గంలో ఓడిపోయామన్న ప్రత్తిపాటి, ఇప్పటికైనా క్షేత్రస్థాయి నాయకత్వం ప్రభుత్వ పనితీరుపై మౌత్ పబ్లిసిటీ ఉధృతం చేయాలన్నారు. అన్నదాతా సుఖీభవ కార్యక్రమానంతరం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా గ్రామంలోని బాలింతలకు ప్రత్తిపాటి పోషకాహార కిట్లు అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల పార్టీ అధ్యక్షులు కామినేని సాయిబాబు, జవ్వాజి మధన్, సొసైటీ చైర్మన్లు మద్దినేని సుబ్బారావు, పోపురి రాఘవయ్య, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటి, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, వీరారెడ్డి, అంబటి సొంబాబు, పోపురి వెంకయ్య, పోపురి రామయ్య గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply