చిలకలూరిపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ షేక్ కరిముల్లా గారిని సన్మానించిన జనసేన పార్టీ నాయకులు మరియు రాధా రంగ మిత్రమండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ మీ అచ్చుకోల మురళీకృష్ణ..

చిలకలూరిపేట మార్కెట్ యార్డు చైర్మన్ గా నియమితులైన శ్రీ షేక్ కరిముల్లా గారిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలవ పూలదండతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన జనసేన పార్టీ నాయకులు మరియు రాధా రంగ మిత్రమండలి చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ గారు మరియు వారి మిత్ర బృందం.. తదనంతరం అచ్చుకోల మురళీకృష్ణ మాట్లాడుతూ.. టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి శ్రీ షేక్ కరిముల్లా గారు పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ పార్టీకి చేస్తున్న సేవా కార్యక్రమాలను మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు మరియు పార్టీ అధిష్టానం ఆయన సేవలను గుర్తించి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగినది. అదేవిధంగా శ్రీ షేక్ కరిముల్లా గారు అనేక పార్టీ ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షిస్తున్నాను.. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు అందెల శౌరి తన్నీరు వీరయ్య మరియు తదితరులు పాల్గొన్నారు..

Share.
Leave A Reply