భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఆత్మీయ సమావేశం
స్థానిక చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు పి వి న్ మాధవ్ ఆగస్టు నాలుగో తారీఖున పల్నాడు జిల్లా నరసరావు పేటకు మొట్టమొదటిసారిగా విచ్చేయు సందర్భంగా ఆరోజు జరిగే కార్యక్రమాలు జయప్రదం చేయడం కోసం సమావేశంలో పాల్గొన్న నాయకులు అందరూ జన సమీకరణ గురించి ఏకగ్రీవంగా జయప్రదం చేయాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి, పట్టణ అధ్యక్షులు కోట పవన్ గాంధీ, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు , ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు పొట్రు పూర్ణచంద్రరావు , ఓ బి సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి, మాజీ కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తూబాటి రాజ్యలక్ష్మి, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, మాజీ నాదెండ్ల మండలం అధ్యక్షులు అలా శివకోటిరెడ్డి, రూరల్ మండలం మాజీ అధ్యక్షులు గోరంట్ల పిచ్చయ్య, మండల ప్రధాన కార్యదర్శి దండా వెంకట శ్రీనివాస్ కుమార్, సీనియర్ నాయకులు ఉప్పల భాస్కరరావు, మాచర్ల శీను, మీడియా ఇన్చార్జి రావికింది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు



