జగ్గాపురంలో వైసీపీకి షాక్

54 మంది జనసేనలోకి!

ఎడ్లపాడు మండలం, జగ్గాపురం గ్రామానికి చెందిన 54 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల ఆకర్షితులై, జనసేన నాయకుల సేవాభావాన్ని చూసి పార్టీలో చేరుతున్నామని తెలిపారు. జనసేనతోనే గ్రామాల అభివృద్ధి, సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని తాము నమ్ముతున్నామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ పరిపాలనకు ఆకర్షితులవుతున్నారని, ఆయన గ్రామీణ వ్యవస్థలను బలపరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. పార్టీలో చేరిన వారికి సంపూర్ణ మద్దతు, సముచిత గౌరవం లభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

పార్టీలో చేరిన వారిలో ముఖ్యులు

తులసి రత్తయ్య, చౌడవరపు రామరావు, తెనాలి రాఘవరావు, తులసి జగన్మోహనరావు, తులసి సుబ్బారావు, తెనాలి సాంబాశివరావు, బత్తినేని వెంకటేశ్వర్లు, వేంగలశెట్టి అప్పారావు, భవిరిశెట్టి శ్రీహరినాథ్, పానకాల సుబ్బారావు, తులసి గోవర్ధనరావు, జెట్టి పవన్, బత్తినేని గోపి, తులసి లక్ష్మణనారాయణ, భవిరిశెట్టి సతయ్యనారాయణతో పాటు మరో 40 మంది ఉన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుభాని, చట్టాల త్రినాథ్, పట్టణ అధ్యక్షులు షేక్ మునీర్ హసన్, మండల ఉపాధ్యక్షులు రామారావు, హనుమంతరావు, వీరాంజనేయులు, తోట నాని, సాంబ తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply