చిలకలూరిపేట పట్టణంలో తెలగ, బలిజ, కాపు కళ్యాణ మండప పునః నీర్మాణ సమావేశం
చిలకలూరిపేట పట్టణంలో ని కృష్ణ డోంక లో గల తెలగ,బలిజ, కాపు కళ్యాణమండపం పునః నీర్మాణ సమావేశం చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
సమావేశంలో కాపు నాయకులు మాట్లాడుతూ 1981 వ సంవత్సరంలో ఆనాటి కాపు పెద్దలు సహకారంతో స్థలము సేకరించి కొంత నిర్మాణం చేపట్టి ఉన్నారు.
రెండు తరాలు దాటి మూడోతరం కారు ఈ కళ్యాణ మండపం పునర్నిర్మాణం చేపట్టటం చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ మండపానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని కాపు నాయకులు తెలియజేశారు.
కొంతమంది కాపు నాయకులు వారి యొక్క విరాళాలు లక్షల్లో ప్రకటించి వారి యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు.
కాపు కళ్యాణ మండపం పునః నీర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిన వారి టీమును కాపు నాయకులందరూ అభినందించారు.
చిలకలూరిపేట నియోజకవర్గ కాపు నాయకులందరూ పాల్గొని, కార్యక్రమాన్ని జయప్రదం చేసి చివరలో భోజనం కార్యక్రమాలు నిర్వహించారు..



