అనుమతులు లేని వెంచర్ల మీద ఉక్కు పాదం మోపుతున్న మున్సిపల్ అధికారులు.
పట్టణ ములో గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎన్నో వెంచర్లు వేసి పట్టణ ప్రజలను మోసం చేసి వాటిని ఎలాగో అలాగా వారికి అంటగడుతూ ఉన్నారు.
ఏ ప్రభుత్వం వచ్చిన రిజిస్టర్ కార్యాలయం దగ్గర నుంచి మొదలుకొని ఆయన మాటల దాటితో వెంచర్ లేసి కొనుగోలు చేయగల ఘనుడని పలువురు చర్చించుకుంటున్నారు.
గతంలో వేసిన వెంచర్లపై మున్సిపల్ అధికారులు దాడులు చేసి నిలుపుదల చేశారు.ఎవరికి తెలియకుండా
కొద్ది రోజుల క్రితం పురుషోత్తపట్నం శివారు హెచ్ పి పెట్రోల్ బంకు వద్ద వేసిన వెంచర్ ఎలాంటి అనుమతులు లేకుండా అక్కడ ప్రజలకి కొనుగోలు చేశారు.
ఈ విషయం మున్సిపల్ అధికారులకు తెలియగా ఆ వెంచర్ పై హద్దురాళ్లను జెసిబి సహకారంతో తొలగించి, అనుమతులు లేని వెంచర్ల పైన చర్యలు తీసుకుంటామని సదరు వ్యక్తిని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.



