పెట్రోల్ బంక్ సిబ్బంది వినియోగదారుడుతో ఖచ్చితంగా మర్యాదగా ప్రవర్తించవలసిందే అని వినియోగదారుల చట్టం 2019 స్పష్టం చేస్తుంది.
……. మురికిపూడి ప్రసాద్
కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం పల్నాడు జిల్లా అధ్యక్షులు
పెట్రోల్ బంకులను తరచుగా పర్యవేక్షించి కొలతలు సరిగా వస్తున్నాయా రావటం లేదా అనే అంశాన్ని నిర్ధారించి వినియోగదారులకు అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులదే .
ఇటీవల నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం లో 400 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే అర లీటర్ పెట్రోల్ వచ్చిందని వినియోగదారుడు వాపోయాడు. ఇదే అంశాన్ని ప్రధాన వార్తా పత్రికలు చానల్స్ ప్రచారం చేశాయి.
ఈ సంఘటన జరిగిన తర్వాత సంబంధిత అధికారులు ఆ బంకును పరిశీలించి కొలతలు కరెక్ట్ గానే ఉన్నాయని నిర్ధారించారు. ఈ మధ్యకాలంలో యజమానులు కొలతలు సరి చేసుకునే సరిచేసుకునే అవకాశం ఉంది. టెక్నాలజీ వాళ్ళ చేతుల్లో ఉంది అంతిమంగా నష్టపోయేది వినియోగదారుడు మాత్రమే.
పెట్రోల్ తగ్గినప్పుడు వినియోగదారుడు, బంక్ సిబ్బంది చొక్కా చొక్కా పట్టుకొని పరిస్థితి ఎన్నడూ రాకూడదు. డబ్బు చెల్లించిన వినియోగదారుడికి 100% న్యాయం చేయవలసిన బాధ్యత పూర్తిగా బంకు యజమానిది. శారీరక బలబలాలు ఎంతవర



