మంచి చేసేవారిని ఆశీర్వదించి మీ జీవితాలు బాగుచేసుకోండి : ప్రత్తిపాటి

  • గతంలో రూ.4,200కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధిచేసినా కొత్తవారిని నమ్మి నష్టపోయారు
  • యడ్లపాడు మండలంలో రోడ్లు కూడా వేయని చరిత్ర మాజీ అవినీతి మంత్రిది.
  • రాష్ట్రాభివృద్ధి.. ప్రజలు మెచ్చే సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమన్న పవన్ వ్యాఖ్యలపై ప్రజలు ఆలోచించాలి.
  • తొలి అడుగులో భాగంగా పలుగ్రామాల్లో రూ.44 లక్షల అభివృద్ధిపనులకు శంఖుస్థాపన చేసిన ప్రత్తిపాటి

మంచి చేసేవారిని కాదని.. మిమ్మల్ని ముంచేవారిని నమ్మి గతంలో ఎంతో నష్టపోయారని, మరలా ఆ తప్పులు పునరావృతం కాకుండా ప్రజలు ఒకేమాటపై నిలిచి కూటమిప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. కొండవీడు కోట ఘాట్ రోడ్డు నిర్మించింది చంద్రబాబేనని, కోటను పర్యాటకంగా అభివృద్ధిచేస్తే చిలకలూరిపేట నియోజకవర్గానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్నారు. నాలుగేళ్లలో కొండవీడును మరింత అభివృద్ధి చేస్తానని ప్రత్తిపాటి చెప్పారు.

రూ.44 లక్షలతో చేపట్టిన సీసీరోడ్లు..డ్రైన్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ప్రత్తిపాటి

సుపరిపాలనలో తొలి అడుగు : ఇంటింటికీ తెలుగుదేశంలో భాగంగా శనివారం ఆయన లింగారావుపాలెం, కోట, సంతపేట, చెంగిజ్ ఖాన్ పేట గ్రామాల్లో పర్యటించారు. తొలుత లింగారావుపాలెంలో దాతల సహాకారంతో ఏర్పాటుచేసిన మంచినీటి ప్లాంట్ ను ప్రారంభించిన ప్రత్తిపాటి రూ.13లక్షలతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం కోట గ్రామంలో రూ.8లక్షలతో, చెంగిజ్ ఖాన్ పేటలో రూ.23 లక్షలతో చేపట్టిన సీసీరోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి శంఖుస్థాపనచేసి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఏప్రియల్ నుంచే రూ.4వేల పింఛన్ అందించిన ఘనత కూటమిప్రభుత్వానిది…

ప్రభుత్వం త్వరలోనే గ్రామాల్లో ఇళ్లులేని పేదలకు ముందుగా స్థలాలు కేటాయించి, తర్వాత ఇళ్ల నిర్మాణం చేపడతుందని ప్రత్తిపాటి చెప్పారు. తల్లికి వందనం సాయం అర్హతకలిగిన ప్రతి తల్లికి అందుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే అన్నదాతాసుఖీభవ, నిరుద్యోగభృతి కూడా అమల్లోకి రానుందన్నారు. ఆగస్ట్ 15 నుంచి మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆనందించవచ్చన్నారు. కూటమిప్రభుత్వం ఏర్పడింది మే నెలలో అయినా, ఏప్రియల్ నుంచే ఇచ్చిన హామీ ప్రకారం నెలకు రూ.4వేల పింఛన్ అందించిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని, ఆయన కష్టాన్ని ప్రజలు గుర్తించాలని ప్రత్తిపాటి సూచించారు.

పవన్ వ్యాఖ్యలపై ప్రజలు ఆలోచన చేయాలి..

జగన్ దెబ్బకు కుదేలైన రాష్ట్రాన్ని, సర్వం కోల్పోయిన ప్రజల్ని కాపాడాలంటే చంద్రబాబుకే సాధ్యమన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రజలు కూడా ఆలోచన చేయాలన్నారు. నియోజకవర్గంలో ముఖ్యంగా యడ్లపాడు మండలంలో రోడ్లు కూడా వేయని గొప్ప చరిత్ర మాజీ అవినీతి మంత్రిదని ప్రత్తిపాటి అసహనం వ్యక్తంచేశారు. రోడ్ల నిర్మాణంలో అలసత్వాన్ని సహించేది లేదని, అధికారులు.. కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తిచేయకుంటే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతానని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. 2014-19 మధ్య నియోజకవర్గ అభివృద్ధికి రూ.4,200కోట్లు టీడీపీ వెచ్చిందని, ప్రజలు పనిచేసేవారిని కాదని, దోచుకునేవారిని నమ్మి ఎంతో నష్టపోయారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. అమరావతి, పోలవరం పూర్తిచేసి ఆ ఫలాలు ప్రజలకు అందించాలన్నదే చంద్రబాబు జీవితాశయమని, అలాంటి నాయకుడికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, కామినేని సాయిబాబు, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, కందిమల్ల రఘురామారావు, పోపురి వెంకయ్య, తోకల రాజేష్, సిలార్, దుర్గారావు, సుధీర్, ఏనాదుల భాస్కర్, ఏనాదుల ఆంజనేయులు, మాణిక్యారావు, హఫీజ్, అజర్, నూర్ తదితర గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply