పేదల ఆరోగ్యం… ఆనందమే ప్రత్తిపాటి ఫౌండేషన్ కు ముఖ్యం : ప్రత్తిపాటి

  • పలు ఆసుపత్రులతో కలిసి ప్రత్తిపాటి ఫౌండేషన్ పేదలకు నాణ్యమైన వైద్యసేవలు ఉచితంగా అందిస్తోంది : ప్రత్తిపాటి
  • 36 ఉచిత వైద్యశిబిరాలతో లక్షలమందికి కంటిచూపు, ఇతర వైద్యసేవలు అందించింది : ప్రత్తిపాటి
  • త్వరలో తిరుపతి బర్డ్స్ ఆసుపత్రితో కలిసి కీళ్ల మార్పిడి వైద్యశిబిరం నిర్వహించనుంది : ప్రత్తిపాటి
  • వ్యాపారవేత్త అరవిందకుమార్ సాయంతో 42 రకాల వైద్యపరీక్షలుచేసే అత్యాధునిక యంత్రాన్ని తాజాగా ప్రజలకోసం అందుబాటులోకి తీసుకొచ్చింది :ప్రత్తిపాటి

ప్రజలకు మెరుగైన కంటివైద్యం అందించించాలన్నసదాశయంతో ప్రభుత్వం కొన్ని వైద్యసంస్థలతో కలిసి మెరుగైన వైద్యసేవలు అందిస్తోందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. శంకర్ నేత్రాలయం వంటి ఆసుపత్రులు ప్రజలకు అందించే సేవల్లో ప్రభుత్వ తోడ్పాటు కూడా ఉందన్నారు. కంటి ఆపరేషన్లు చేయించుకునే ఒక్కో వ్యక్తికి ప్రభుత్వం రూ.2వేల ఆర్థిక సాయం అందిస్తోందని ప్రత్తిపాటి చెప్పారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన 36వ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీమంత్రి, 35వ వైద్యశిబిరంలో ఆపరేషన్లు చేయించుకున్న వారికి ఉచిత కళ్లద్దాలు అందించారు. అనంతరం దండమూడి హెల్త్ ఆఫీస్ సర్వీస్ (డీ.హెచ్.ఓ.ఎస్) వారు అందుబాటులోకి తీసుకొచ్చిన అధునాతన వైద్యపరీక్షల యంత్రాన్ని ప్రత్తిపాటి లాంఛనంగా ప్రారంభించారు. యంత్రంతో 42 రకాల వైద్యపరీక్షలు చేయవచ్చని, అతి తక్కువఖర్చుతోనే ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తామని డీ.హెచ్.ఓ.ఎస్ డైరెక్టర్ దండమూడి అరవింద్ కుమార్, ఎమ్మెల్యే ప్రత్తిపాటికి తెలియచేశారు.

పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేసే సాయంలో కొన్ని స్వచ్ఛందసంస్థలు.. దాతలు భాగస్వాములు కావడం నిజంగా అభినందనీయమన్నారు. ప్రత్తిపాటి ఫౌండేషన్ ఇప్పటివరకు శంకర్ నేత్రాలయం, మణిపాల్, కిమ్స్, సెంటినీ వంటి వైద్యసంస్థలతో కలిసి 36 వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. కంటి వైద్యశిబిరాల నిర్వహణతోనే ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుందన్న ప్రత్తిపాటి, కుల..మతాలకు అతీతంగా పేదలకు సేవచేసే భాగ్యం ఫౌండేషన్ కు దక్కడం గొప్ప విషయమన్నారు. ఇకపై ఫౌండేషన్ నిర్వాహకులు ప్రతి 3 నెలలకు ఒక వైద్య శిబిరం నిర్వహిస్తారని ప్రత్తిపాటి చెప్పారు.

రూ.700లకే 42 రకాల వైద్యపరీక్షలు…. 20 నిమిషాల్లోనే పూర్తి వివరాలు.

త్వరలోనే టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రితో కలిసి ఉచిత కీళ్లమార్పిడి చికిత్సలు కూడా చేయబోతున్నట్టు ప్రత్తిపాటి చెప్పారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ జగదీశ్ నేత్రత్వంలోని బృందం పేదలకు మోకాళ్ల సంబంధిత వైద్యసేవలు అందిస్తుందన్నారు. అరవింద్ కుమార్ 42 రకాల వైద్యపరీక్షలు చేసే యంత్రాన్ని ప్రజలకోసం అందుబాటులోకి తీసుకొచ్చారని, రూ.700లకే అన్నిరకాల వైద్యపరీక్షలు చేయించుకోవచ్చన్నారు. 42 వైద్యపరీక్షల సమాచారం కేవలం 20 నిమిషాల్లోనే రోగుల ఫోన్లకు అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజల ఆరోగ్యపరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ప్రత్తిపాటి చెప్పారు.

ప్రజల ఆరోగ్యమే ముఖ్యమనే నాయకుడు ఉండటం పేట ప్రజల అదృష్టం : అరవింద్ కుమార్ (డీ.హెచ్.ఓ.ఎస్ డైరెక్టర్)

ప్రజల ఆరోగ్యమే మాకు ముఖ్యమనే నాయకుడు మీకు దొరకడం నిజంగా పేట ప్రజల అదృష్టమని, మేం తయారుచేసిన మిషన్ గురించి చెప్పిన వెంటనే ప్రత్తిపాటి సంతోషించారని డీ.హెచ్.ఓ.ఎస్ డైరెక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. అలాంటి మిషన్లు మరిన్ని తయారుచేసి గ్రామీణ ప్రజలకు ఉచితంగా వైద్యపరీక్షలు చేయాలని ప్రత్తిపాటి చెప్పడం చాలా సంతోషం కలిగించిందని అరవింద్ కుమార్ చెప్పారు. కార్యక్రమంలో శంకర్ ఆసుపత్రి శ్రీనివాసరావు, డాక్టర్ సుధీర్, మాజీ ఎమ్మెల్యే కందిమళ్ళ జయమ్మ, డాక్టర్ ముద్దన రమేష్, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్, పఠాన్ సమాధ్ ఖాన్, మద్దుమలా రవి కందుల రమణ, కంచర్ల శ్రీనివాసరావు, మారెళ్ళ అప్పారావు, పట్టణ సిఐ రమేష్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply