వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఏర్పాట్లు – బొల్లా బ్రహ్మనాయుడు గారు స్వయంగా పర్యవేక్షణ
వినుకొండ నియోజకవర్గంలో రేపు జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతంగా జరగేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర PAC సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు స్వయంగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.
సమావేశ వేదిక వద్ద స్టేజ్, కూర్చోవడానికి సదుపాయాలు, నీటి సరఫరా, పార్కింగ్, భద్రత అంశాలపై ప్రత్యక్షంగా సమీక్షిస్తున్న ఆయన, స్థానిక నాయకులకు దిశానిర్దేశం అందించారు.



