నేతన్నల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ధ్యేయం : ప్రత్తిపాటి
- గ్రూపులు, .పార్టీలకు అతీతంగా అందరూ కష్టంతో ఎదగండి :ప్రత్తిపాటి.
- కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సబ్సిడీలు.. ప్రోత్సాహకాల్ని నేతన్నలు సద్వినియోగం చేసుకోవాలి :ప్రత్తిపాటి
అనాది నుంచి చిలకలూరిపేట ప్రాంతం చేనేతపనికి పెట్టింది పేరని, కేంద్రప్రభుత్వ సబ్సిడీతో చేనేత కార్మికులు స్టాండ్ మగ్గాలతో తమ ఉత్పత్తుల తయారీ పెంచుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో గురువారం జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లస్టర్ స్థాయి చేనేత కార్మికుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రత్తిపాటి నేతకార్మికుల్ని ఉద్దేశించి మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సబ్సిడీలతో నేతన్నలు ఆర్థికంగా బలపడాలి
కేంద్ర జౌళిశాఖ ఒక్కో నేతగ్రూపుకు రూ.85లక్షల వరకు సబ్సిడీ ఇస్తోందని, గ్రూపుసభ్యులు కేవలం రూ.3లక్షలు కట్టుకుంటే చాలని ప్రత్తిపాటి చెప్పారు. ఆ సొమ్ముతో నూతన మగ్గాలు.. సరికొత్త ఉత్పత్తులతో నేత పనివారు బాగా సంపాదించుకోవచ్చని ప్రత్తిపాటి సూచించారు.



